జ్యోతికకు తలనొప్పిగా మారిన ప్రియమణి, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా..?
సాధారణంగా ఫామ్ లో ఉన్న హీరోయిన్లు, హీరోల మధ్య పోటీతో పాటు.. ఒక్కోసారి యుద్ద వాతావరణం కొనసాగుతుంది. కాని ఇక్కడ హీరోయిన్లుగా రిటైర్ అయిన తారల మధ్య పోటీ నెలకొంది. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో తెలుసా..?
జ్యోతిక- ప్రియమణి.. ఇద్దరు ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన మెరిసిన తారలు. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు గా రిటైర్ అయ్యారు. ఎవరికి వారు డిఫరెంట్ లైఫ్ స్టేల్ ను కొనసాగిస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లోను ముద్దుగుమ్మలు జ్యోతిక – ప్రియమణి ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో తెలుగు తమిళ కుర్రాళ్లను ఊపు ఊపేసిన అందాల ముద్దుగుమ్మలు . ఇప్పుడు సీనియర్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే జ్యోతికకు ప్రియమణి తలనొప్పి క్రియేట్ చేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .
చాలా కాలం ఇంటికే పరిమితం అయ్యింది జ్యోతిక. సూర్యను ప్రేమించి పెళ్ళాడిన తరువాత ఆమె ఫ్యామిలీని చూసుకుంటూ ఉండిపోయింది. ఇక పిల్లలు పెద్దవాళ్లు అవ్వడంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి.. పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తోంది. అలా విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ సాధిస్తోంది సీనియర్ బ్యూటీ. ఈక్రమంలో జ్యోతికకు తలనొప్పిగా మారిందట ప్రియమణి.
సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి ఎలాంటి పాత్రలు చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో పాటు.. వీరాట పర్వం, జవాన్ లాంటి సినిమాలు ప్రియమణికి ప్రత్యేక ఇమేజ్ ను తీసుకొచ్చింది. అన్ని జనాలను మెప్పించే పాత్రలే కావడం గమనార్హం. అయితే జ్యోతిక ఆఫర్లను ప్రియమణి దక్కించుకుంటుందట. దానికి కారణం కూడా ఉంది.
జ్యోతిక తన దగ్గరకు వచ్చిన మేకర్స్ కు రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తుందట.. దాంతో జ్యోతికకు ఆల్టర్నేటీవ్ గా ఎవరు ఉన్నారు అని చూస్తే.. మేకర్స్ కు ప్రియమణి కనిపిస్తోంది. దాంతో జ్యోతిక వరకు వచ్చిన ఆ పాత్రలు ఇప్పుడు ప్రియమణికి వెళ్ళిపోతున్నాయట. ప్రియమణి రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయకుండా ఉంటే.. ఆ పాత్రలు జ్యోతిక చేసి ఉండేది అంటున్నారు.