దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి పార్ట్ 'కథానాయకుడు' పేరుతో జనవరి 9న విడుదల చేయనున్నట్లు అలానే రెండో పార్ట్ 'మహానాయకుడు' పేరుతో జనవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

అసలు ఈ సినిమాను రెండు భాగాలుగా ఎందుకు తీయాలనుకున్నారనే విషయంలో కొన్ని ఆసక్తికర సంగతులు వెలుగులోకి వచ్చాయి. కథానాయకుడిగా రానున్న పార్ట్ 1 లో ఎన్టీఆర్ బాల్యం, యవ్వనదశ, హీరోగా ఆయన ఎదిగిన తీరుని చూపించబోతున్నారు. ఇక పార్ట్ 2 అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే తీస్తున్నారని తెలుస్తోంది.

పార్ట్1 లో ఉండేంత ఎంటర్టైన్మెంట్ పార్ట్ 2 లో ఉండదని అంటున్నారు. ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావడం, సంక్షేమపథకాలు లాంటి సన్నివేశాలతో సినిమా మొత్తం సాగుతుందని అంటున్నారు. ఎన్నికల ప్రచారాన్ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నారని సమాచారం.

ఎన్నికల సమయంలో ఊరూరు తిరిగి ఎక్కడ పడితే అక్కడ ఈ సినిమా ప్రదర్శించుకునేందుకు ఆలోచన చేస్తున్నారట. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ని జనాలకు గుర్తు చేయడమనే పాజిటివ్ ఆలోచనతో రెండో భాగం ప్లానింగ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!