విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమాలో రాజకీయాలకు సంబంధించి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆ సినిమాను ఎలక్షన్ కమీషన్ చూసి అప్పుడు విడుదలకు అనుమతి ఇవ్వాలని కొందరు రాజకీయనాయకులు కోరారు.

మరికొందరు ఈ సినిమా విడుదల కాకూడదని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మన నేతలు ఇంతగా భయపడడానికి అసలు ఈ సినిమాలో ఏముందనే ఆసక్తి ప్రజల్లో మరింత ఎక్కువైంది. మొదట ఎలాంటి బజ్ లేని ఈ సినిమాకి మన నేతలు ఫ్రీపబ్లిసిటీ కల్పించారు.  

టైటిల్, ట్రైలర్‌లోని సన్నివేశాలపై అభ్యంతరాలు లేవనెత్తి ఓ రకంగా ఉచితంగా పబ్లిసిటీ ఇస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్న నేపధ్యంలో ఈ సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని రాజకీయనాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే సినిమా ట్రైలర్ లో రెండు, మూడు సన్నివేశాలనుచూసి వారిపై ఆపదిన్చుకోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు.. తమ అభ్యర్ధులు సమర్దులైతే.. ఈ సినిమా గురించి రాజకీయ పార్టీలు భయపడాల్సిన అవసరం ఏముందని కౌంటర్లు వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి..

విజయ్ దేవరకొండ 'నోటా' టార్గెట్ ఎంతంటే..?

రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!

టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్!

సినిమా రిలీజ్ ఆపడానికి చాలా చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?

రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?