Asianet News TeluguAsianet News Telugu

#Nithin: 'మాచర్ల నియోజక వర్గం' ఓటిటి రిలీజ్ డేట్, ఇంత తొందర్లోనా?

తిన్ హీరోగా విడుద‌లైన‌ సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల న‌డుమ వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. తొలి రోజు ఈ చిత్రానికి  డివైడ్ టాక్ వ‌చ్చింది. ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై పడింది.

Nithin Macherla Niyojakavargam OTT Details
Author
Hyderabad, First Published Aug 15, 2022, 7:43 AM IST


నితిన్ కి కొంతకాలంగా హిట్టు అనేది లేదు.  ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో ఆయన 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేశాడు. పొలిటికల్ టచ్ తో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సుధాకర్ రెడ్డి - నికితా రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమయ్యాడు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేసారు. అయితే సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై అంతటా నెగిటివ్ కామెంట్స్ వినపడ్డాయి. రివ్యూలు చాలా దారుణంగా వచ్చాయి. పక్కా రొటీన్ మార్క్ ఫిల్మ్ అని తేల్చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ బయిటకు వచ్చాయి.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మరి కొద్ది వారాల్లోనే ఓటిటిలో పలకరించనుంది. అమేజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రం ఓటిటి రైట్స్ తీసుకున్నారు. సెప్టెంటబర్ 9న ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ కానుందని తెలుస్తోంది.  రిలీజైన నాలుగు వారాల్లో ఓటిటిలో వస్తోంది. మరి ఓటిటిలో ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.  

ఇక ఈ చిత్రం రిలీజ్ కు ముందు దర్శకుడు  రాజశేఖర్ రెడ్డి ట్విట్స్ తో వివాదంలో ఇరుక్కుంది. దాంతో కొందరు ఈ సినిమా బ్యాన్ చేసారని చెప్తున్నారు. అందుకే దారుణమైన రిజల్ట్ వచ్చిందంటున్నారు. ఈ దర్శకుడు  గతంలో ట్విట్టర్ లో రెండు కులాలని కించపరుస్తూ చేసిన కొన్ని వివాదాస్పదమైన ట్వీట్  కామెంట్స్ వైరల్ గా మారాయి. ఐతే ఇదంతా తప్పుడు ప్రచారమని, కావాలనే తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ కేసు కూడా పెట్టాడు రాజశేఖర్.  ఈ విషయమై నితిన్ సైతం ట్వీట్ చేసాడు. కానీ అందరూ రాజశేఖర్ రెడ్డిని తప్పుపడుతున్నారు.  
 
మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయన్స్ గా కృతి శెట్టి .. కేథరిన్ అలరించనున్నారు. ఈ సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి చీఫ్ గెస్టుగా ఈ వేడుక జరిగింది.  

Follow Us:
Download App:
  • android
  • ios