బిగ్‌ బాస్‌ సందడి మొదలైంది. సీజన్‌ 4 కోసం గత సీజన్ల కంటే మరింత భారీగా హౌస్‌ను డిజైన్‌ చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తు తీసుకున్నారు. అయితే అన్ని బాగానే ఉన్నా.. హౌస్‌లోకి ఎంటర్‌ అయిన కంటెస్టెంట్‌ల విషయంలోనే నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు బిగ్ బాస్‌ ఫ్యాన్స్‌. తొలి మూడు సీజన్లలో స్టార్ ఇమేజ్‌ వారే ఎక్కువ మంది వచ్చారు.

కనెక్షన్స్‌ పేరుతో కొత్త కిరికిరి పెట్టిన బిగ్ బాస్

కానీ ఈ సీజన్‌లో మాత్రం కాస్త గ్లామర్‌ తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సారి హౌస్‌లో పెద్దగా ఫేం లేని వారే ఎక్కువగా ఉన్నారంటున్నారు నెటిజెన్లు. ముఖ్యంగా అఖిల్ సార్తక్‌, దివి, అరియానా గ్లోరి, ఇస్మార్ సోహెల్‌ లాంటి వారు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వారే. సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్‌, అభిజిత్‌ లాంటి వారు ఎప్పుడో ఫేడ్‌ అవుట్‌ అయిన వారే. దీంతో కంటెస్టెంట్‌ల సెలక్షన్‌లపై పెదవి విరుస్తున్నారు ఆడియన్స్‌.

ఆట మొదలెట్టిన బిగ్ బాస్‌.. సీక్రెట్‌ రూంలోకి ఇద్దరు కంటెస్టెంట్‌లు

హౌస్‌లోకి హీరోయిన్‌ మోనాల్ గజ్జర్‌, దర్శకుడు సూర్య కిరణ్, యాంకర్ లాస్య, హీరో అభిజిత్‌, యాంకర్‌ జొర్దర్‌ సుజాత, దిల్‌ సే మెహబూబ్‌, టీవీ 9 యాంకర్‌ దేవీ నాగవల్లి, యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక, సీరియల్ నటుడు ఇస్మార్ట్ సోహైల్‌, యాంకర్‌ అరియానా గ్లోరి, కరాటే కళ్యాణీ, దివి, అఖిల్ సార్తక్‌, అమ్మా రాజశేఖర్‌, సింగర్‌ నోయల్‌ సీన్, గంగవ్వలు ఎంటర్‌ అయ్యారు.