బుల్లితెర మీద బిగ్‌ బాస్‌ హవా మొదలైంది. సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం బిగ్ బాస్‌ షో  ప్రారంభమైంది. నాగార్జున వ్యాఖ్యతగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి పంపించాడు. అయితే కంటెస్టెంట్‌ల పరిచయం దగ్గర నుంచే బిగ్‌ బాస్ గేమ్ మొదలు పెట్టాడు. తొలి నలుగురు కంటెస్టెంట్‌లు వెళ్లిన తరువాత వారికి తరువాత వెళ్లిన నలుగురితో కనెక్షన్స్‌ క్రియేట్ చేశాడు బిగ్ బాస్‌, ఆ కనెక్షన్స్‌ను భవిష్యత్తులో ఎలా చూపిస్తాడో చూడాలి.

కనెక్షన్స్‌ పేరుతో కొత్త కిరికిరి పెట్టిన బిగ్ బాస్

తరువాత 9, 10 నెంబర్లుగా ఎంటర్‌ అయిన్‌ సీరియల్‌ నటుడు ఇస్మార్ట్‌ సోహెల్‌, యాంకర్‌ అరియానా గ్లోరిలను ఒకేసారి హౌస్‌లోకి పంపించాడు. అయితే వారిని అందరి లాగా డైరెక్ట్‌గా హౌస్‌లోకి పంపకుండా ఓ సీక్రెట్‌ రూంలోకి పంపించాడు బిగ్ బాస్. వారు ఆ రూం నుంచి హౌస్‌లోని వారందరు ఏం చేస్తున్నారో చూసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం సీక్రెట్ రూంలో ఉంటున్న సోహెల్‌, అరియానాలు ఎప్పుడు హౌస్‌లోకి ఎంటర్‌ అవుతారో చూడాలి.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిగ్ బాస్‌.. ట్విటర్‌ ట్రెండ్స్‌లో టాప్

హౌస్‌లోకి హీరోయిన్‌ మోనాల్ గజ్జర్‌, దర్శకుడు సూర్య కిరణ్, యాంకర్ లాస్య, హీరో అభిజిత్‌, యాంకర్‌ జొర్దర్‌ సుజాత, దిల్‌ సే మెహబూబ్‌, టీవీ 9 యాంకర్‌ దేవీ నాగవల్లి, యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక, సీరియల్ నటుడు ఇస్మార్ట్ సోహైల్‌, యాంకర్‌ అరియానా గ్లోరి, కరాటే కళ్యాణీలు ఎంటర్‌ అయ్యారు.