బుల్లితెర బిగ్ ఎంటర్‌టైన్మెంట్ మొదలైంది. బిగ్ బాస్‌ సీజన్‌ 4 ఈ రోజు మొదలైంది. ఆరు గంటలకు నాగ్ ద్విపాత్రాభినయంతో షో ప్రారంభమైంది. ఆ తరువాత ఒక్కొక్కరుగా కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంటర్‌ అవుతున్నారు. ఈ సమయంలో నలుగురు కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంటర్‌ అయిన తరువాత కొత్త కిరికిరి స్టార్ట్‌ చేశాడు బిగ్ బాస్‌. హౌస్‌లోకి వెళ్లిన నలుగురు కంటెస్టెంట్‌లకు కనెక్షన్స్‌ పేరుతో నాలుగు బాక్స్‌లు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు.

బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్స్ లైవ్‌ అప్‌డేట్స్

ఆ బాక్స్‌ల్లో ఒక్కో ప్రాపర్టీ ఉంది. ఆ తరువాత హౌస్‌లోకి ఎంటర్‌ అవుతున్న మరో నలుగురు కంటెస్టెంట్‌లకు హౌస్‌లో ఉన్నవారితో కనెక్ట్ అయ్యేలా ప్రాపర్టీ ఉన్న బాక్స్‌లను గిప్ట్‌ ఇచ్చి లోపలికి పంపించారు. అయితే అలా కనెక్ట్ అయిన వారికి బిగ్‌ బాస్‌ ఎలాంటి కనెక్షన్‌ పెడతాడో చూడాలి. సూజత - మోనల్‌ గజ్జర్‌, మెహబూబ్‌ - లాస్య, సూర్య కిరణ్ - దేవీ నాగవల్లి, దేత్తడి  హారిక - అభిజిత్‌ల ప్రాపర్టీలు మ్యాచ్‌ అయ్యాయి.