Asianet News TeluguAsianet News Telugu

హిందీ హాస్య నటి, హోస్ట్ భారతి సింగ్‌ ఇంటిపై ఎన్‌సీబీ దాడులు

 ప్రముఖ పాపులర్‌ హాస్య నటి, హిందీ పాపులర్‌ టెలివిజన్‌ హోస్ట్ భారతి సింగ్‌ ఇంటిపై ఎన్‌సీబీ దాడులు చేసింది. ఇంట్లో అక్రమంగా డ్రగ్స్ ఉందనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఈ శనివారం ఉదయం ఈ సోదాలు నిర్వహించారు. దీంతో మరోసారి డ్రగ్స్ కేసు హల్‌చల్‌ అవుతుంది. 

ncb raids on telivision host barthi singh house arj
Author
Hyderabad, First Published Nov 21, 2020, 1:19 PM IST

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది స్టార్స్ నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముందు హాజరయ్యారు. తాజాగా ప్రముఖ పాపులర్‌ హాస్య నటి, హిందీ పాపులర్‌ టెలివిజన్‌ హోస్ట్ భారతి సింగ్‌ ఇంటిపై ఎన్‌సీబీ దాడులు చేసింది. ఇంట్లో అక్రమంగా డ్రగ్స్ ఉందనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఈ శనివారం ఉదయం ఈ సోదాలు నిర్వహించారు. దీంతో మరోసారి డ్రగ్స్ కేసు హల్‌చల్‌ అవుతుంది. 

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో ఈ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రియురాలు రియా వాడుతుందనే ఆరో్పణలపై విచారణ జరుపగా, ఆమె అనేక మంది బాలీవుడ్‌ సెలబ్రిటీల పేర్లు వెల్లడించింది. దీంతో సుశాంత్‌ ఆత్మహత్య కేసు కాస్త డ్రగ్స్ వైపు మళ్ళింది. 

ఇందులో ఇప్పటికే రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు, సుశాంత్‌ ఫ్రెండ్స్, కొందరు సన్నిహితులను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. ఆ తర్వాత దీపికా పదుకొనె, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌ వంటి స్టార్‌ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. వారిని ఎన్‌సీబీ విచారించింది. 

వీరితోపాటు ఇటీవల బాలీవుడ్‌ హీరో అర్జున్‌ రాంపాల్‌పై, ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ పై ఆరోపణలు రాగా వారిని కూడా ఎన్‌సీబీ అధికారులు విచారించారు. వారింట్లో సోదాలు చేయగా కొంత గంజాయి దొరికినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రియురాలు డెమెట్రియేడ్స్ ని రెండు రోజులు, రాంపాల్‌ని ఓ రోజు విచారించారు. ఇదంతా గత వారం జరిగింది. 

ఈ సందర్భంగా అర్జున్‌ రాంపాల్‌ స్పందిస్తూ, `నేను దర్యాప్తుకి సహకరిస్తున్నాను. కానీ నాకు డ్రగ్స్ తో సంబంధం లేదు, నా నివాసంలో దొరికిన మందులు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ప్రకారమే ఉన్నాయి. వాటిని అప్పగించాను` అని తెలిపారు. వీరితోపాటు బాలీవుడ్‌ నిర్మాత ఫిరోజ్‌ నడియడ్‌వాలా ఇంట్లో సోదాలు చేయగా, పది గ్రాముల గంజాయి దొరికింది. దీంతో వారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios