Asianet News TeluguAsianet News Telugu

నటుడి తమ్ముడిపై లైగింక వేదింపుల కేసు

నాకు రెండేళ్లు ఉన్నపుడు మా అమ్మానాన్న విడిపోయారు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో మా చిన్నాన్న‌( నవాజుద్దీన్‌ తమ్ముడు)నన్ను లైంగికంగా ఇబ్బంది పెట్టారు. నేను ఎంతో హింసకు గురయ్యాను. నాకప్పుడు ఆ విషయం అర్థం అయ్యేది కాదు. పెద్దయ్యాక అతడి చేష్టలను గుర్తించాను. పెళ్లైన తర్వాత కూడా వారి వేధింపులు తగ్గలేదు. మా అత్తింటి వారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించేవారు అంటూ చెప్పుకొచ్చింది.

Nawazuddin Niece Accuses His Brother of Sexual Harassment
Author
Hyderabad, First Published Jun 3, 2020, 12:20 PM IST

బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తమ్ముడు..కుటుంబం ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల నవాజుద్దీన్‌ నుంచి విడాకులు కోరుతూ తన న్యాయవాది ద్వారా అలియా నోటిసులు పంపించిన విషయం తెలిసిందే.  ఈ వివాదం సమిసి పోకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తను తొమ్మిదేళ్ల వయసులో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని  నవాజుద్దీన్‌ కూతురు(వరుసకు) పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని జమీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘ నాకు రెండేళ్లు ఉన్నపుడు మా అమ్మానాన్న విడిపోయారు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో మా చిన్నాన్న‌( నవాజుద్దీన్‌ తమ్ముడు)నన్ను లైంగికంగా ఇబ్బంది పెట్టారు. నేను ఎంతో హింసకు గురయ్యాను. నాకప్పుడు ఆ విషయం అర్థం అయ్యేది కాదు. పెద్దయ్యాక అతడి చేష్టలను గుర్తించాను. పెళ్లైన తర్వాత కూడా వారి వేధింపులు తగ్గలేదు. మా అత్తింటి వారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించేవారు అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే ఓ రోజు పెదనాన్న(నవాజుద్దీన్‌) నన్ను ‘నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు?’ అని అడిగారు. అప్పుడు నేను, నాపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాను. మానసికంగా బాగా కృంగిపోయానని అన్నాను. ఆయన మాత్రం అలా ఏం జరిగి ఉండదన్నారు. ‘అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు’ అన్నారు. కనీసం పెదనాన్న అయినా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ అలా జరగలేదు ’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడీ విషయం ముంబై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios