యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగాలని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. తమ అభిమాన నటుడిని ఒక్కసారి దగ్గర నుండి చూసిన చాలని అనుకుంటారు. అయితే ఓ హీరో తల్లి తారక్ కి వీరాభిమాని. తారక్ పై ఆమెకున్న ఇష్టంతో అతడి దగ్గరకి వెళ్లి ఎంతో ఆప్యాయంగా ఫోటో దిగింది. 

ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? 'అరవింద సమేత' సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నవీన్ చంద్ర. ఈ సందర్భంగా అతడు తన తల్లితో తారక్ ఫోటోని షేర్ చేస్తూ.. ''నీవు కలగనేది సాధించడంలో సక్సెస్ ఉండదు.

నా విషయంలో సక్సెస్ అంటే అమ్మ కలని నిజం చేయడమే. తారక్ గారిలో బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే.. సింప్లిసిటీ, విధేయత. అమ్మా.. నీ ఎగ్జైట్మెంట్ నా బలం, ప్రేరణ. నీ ప్రతి కలని నేరవేర్చడాన్ని నా కలగా మార్చుకున్నా'' అంటూ పోస్ట్ పెట్టాడు. హీరోగా నవీన్ చంద్ర ఎన్ని సినిమాలు చేసినా.. బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నాడు.

ఈ క్రమంలో చాలా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. 'అరవింద సమేత'లో కూడా అతడికి మంచి పాత్ర దక్కిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ప్రీరిలీజ్ వేడుకలో నవీన్ చంద్ర పాత్ర అధ్బుతంగా ఉంటుందని అన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

ఆ పాట విని అమ్మ ఏడ్చేసింది: ఎన్టీఆర్!

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ అభిమానులు ఊహించని సర్ప్రైజ్!

'అరవింద సమేత'పై మహేష్ బాబు కన్ను!

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!