Asianet News TeluguAsianet News Telugu

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. కేవలం చిత్రబృందం అభిమానుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

4.8 million views for aravinda sametha trailer
Author
Hyderabad, First Published Oct 3, 2018, 11:02 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. కేవలం చిత్రబృందం అభిమానుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఎన్టీఆర్ నటవిశ్వరూపం ట్రైలర్ లో చూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ట్రైలర్ కట్ చేశాడు త్రివిక్రమ్. నిన్న సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో విడుదలైన సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్ కి 4.8 మిలియన్ల వ్యూస్ దక్కాయి.

ట్రైలర్ పెట్టిన కొద్ది గంటల్లో మిలియన్ వ్యూస్ ని సాధించడం ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ కి నిదర్శనం. మరో పక్క ట్రైలర్ కి లైక్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. త్రివిక్రమ్ డైలాగ్స్, ఎన్టీఆర్ నటన ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. తమన్ అందించిన నేపధ్య సంగీతం కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!

కళ్యాణ్ రామ్ స్పీచ్ తో ఏడ్చేసిన ఎన్టీఆర్!

ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం.. 'అరవింద సమేత' ట్రైలర్ టాక్!

Follow Us:
Download App:
  • android
  • ios