మలయాళ నటుడు మోహన్‌ లాల్, మీనా  కలిసి నటిస్తోన్న చిత్రం ‘దృశ్యం 2’. గతంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతుంది. సెప్టెంబర్ నెలలో  పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  థ్రిల్లర్‌ క్రైం నేపథ్యంలో సాగే ఈ కథ విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది. మరోసారి ఉత్కంఠ పెంచేందుకు రాబోతుంది. ఆశీర్వాద్‌ సినిమాస్‌ సమర్పణలో ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ  చిత్రం టీజర్ ని నూతన సంవత్సర కానుకగా ఈ రోజున విడుదల చేసారు. మీరు ఇక్కడ ఈ టీజర్ ని చూడవచ్చు. 

 ఈ చిత్తరం షూటింగ్‌ని కేవ‌లం 46 రోజుల‌లో పూర్తి చేశారు.  కేర‌ళ‌లో ఇప్ప‌టికీ థియేట‌ర్స్ తెర‌వ‌ని కార‌ణంగా మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేస్తున్నారు.  ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  ఫ్యామిలీ వాల్యూస్, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అంశాల క‌ల‌బోత‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ సీక్వెల్ హిట్టైతే తొలి భాగంలాగే ఈ చిత్రాన్ని  తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో  రీమేక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.  ఫస్ట్ పార్ట్ చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది.