మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక సెప్టెంబర్ 18 బుధవారం రోజు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. దీనితో మెగా అభిమానుల సంబరాలు అప్పుడే సోషల్ మీడియాలో అంబరాన్ని అంటుతున్నాయి. 

ఇదిలా ఉండగా సైరా ట్రైలర్ ని థియేటర్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని అప్సర థియేటర్, గుడివాడలోని జి3  సింధూర, బందర్ లోని శ్రీ వెంకట్ థియేటర్స్ లో సైరా చిత్ర ట్రైలర్ ని ప్రదర్శించనున్నారు. అలాగే హైదరాబాద్ లో కూడా సైరా ట్రైలర్ ప్రదర్శనకు థియేటర్స్ ఖరారయ్యాయి. 

సంధ్య, సుదర్శన్ థియేటర్స్ లో సైరా ట్రైలర్ ప్రదర్శన జరగనుంది. ఈ నేపథ్యంలో సంబరాలు చేసుకునేందుకు అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సైరా ట్రైలర్ ని సాయంత్రం 5.31 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

'సైరా' ప్రీరిలీజ్ బిజినెస్.. దిల్ రాజు సహా ఎవరెవరంటే!

బాంబులా పేలిన 'సైరా' డిజిటిల్ రైట్స్ ధర.. వామ్మో ఇంతా!

మెగా ఫ్యాన్స్ లో కలవరం.. వెనుకబడ్డ 'సైరా' ప్రమోషన్స్

బాహుబలిని మించిపోయిన 'సైరా'!

మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

అఫీషియల్: 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం ఇదే!