MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Krishnam Raju: స్టార్‌ డైరెక్టర్‌ ఫ్యామిలీకి 3000 ఎకరాలు రాసిచ్చిన కృష్ణంరాజు తాత.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్‌

Krishnam Raju: స్టార్‌ డైరెక్టర్‌ ఫ్యామిలీకి 3000 ఎకరాలు రాసిచ్చిన కృష్ణంరాజు తాత.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్‌

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుది రాజుల ఫ్యామిలీ. మొగల్తూరు మహారాజా వారు.. తెలుగు స్టార్‌ దర్శకుడికి ఫ్యామిలీకి ఏకంగా మూడు వేల ఎకరాలు రాసిచ్చాడట. అందుకు కారణం తెలిస్తే మాత్రం ఫ్యూజుల్‌ ఎగిరిపోవాల్సిందే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 08 2026, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మొగల్తూరు మహారాజులు కృష్ణంరాజు ఫ్యామిలీ
Image Credit : Asianet News

మొగల్తూరు మహారాజులు కృష్ణంరాజు ఫ్యామిలీ

కృష్ణంరాజు.. రాజుల ఫ్యామిలీ. ఆయనకు ముందు పది తరాలు రాజులుగా ఉన్నారు. దాదాపు తొమ్మిది సంస్థాలను పరిపాలించారు. నిజాం నవాబ్‌ ఆధీనంలో ఈ సంస్థానాలు పనిచేసేవి. ఆ తర్వాత క్రమంగా రాజుల కాలం పోయింది. కృష్ణంరాజు ఫ్యామిలీ అంతా సోషలైజ్‌ అయ్యింది. అందరిలో కలిసిపోయారు. ఇప్పుడు అందరిలాగానే ఉన్నారు. కానీ వారి వ్యక్తిత్వం విషయంలో మాత్రం రాజుల మనస్తత్వం పోలేదు. ఎవరికైనా సహాయం చేయడంలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, అడిగిన వారికి కాదనకుండా ఇచ్చే విషయంలో వారు ముందుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సహాయం చేయడంలో ముందుండే కృష్ణంరాజు ఫ్యామిలీ
Image Credit : Facebook/KrishnamRaju

సహాయం చేయడంలో ముందుండే కృష్ణంరాజు ఫ్యామిలీ

కృష్ణంరాజు అంటే, ఆ తర్వాత ప్రభాస్‌ కూడా అంతే. తన ఇంటికి వచ్చినవారికి పసందైన విందు భోజనం పెట్టకుండా పంపించరు. ప్రభాస్‌ విషయంలో ఆయనతో సినిమాలు చేసిన ప్రతి ఒక్కరు ఈ మాట చెబుతారు. వారసత్వంగా ఆ లక్షణాలు వచ్చాయి. జీన్స్ లోనే ఆ మంచి లక్షణాలున్నాయని చెప్పొచ్చు. అయితే  స్టార్‌ డైరెక్టర్‌కి కృష్ణంరాజు తాత వేల ఎకరాలు రాసిచ్చాడట. ఆ విషయాన్ని దర్శకుడు రాజా వన్నెంరెడ్డి తెలిపారు. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Related Articles

Related image1
NTR vs Superstar Krishna: వారసుల కోసం గొడవకు దిగిన ఎన్టీఆర్‌, కృష్ణ.. చివరికి బాలయ్య, రమేష్‌ బాబుకి డిజాస్టర్లు
Related image2
Nagarjuna, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? ఆ స్టార్‌ డైరెక్టర్‌ వల్లే
34
మొగల్తూరు రాజుకి మజ్జిక ఇచ్చిన దర్శకుడి ఫ్యామిలీ
Image Credit : our own

మొగల్తూరు రాజుకి మజ్జిక ఇచ్చిన దర్శకుడి ఫ్యామిలీ

కృష్ణంరాజు తాతలు మొగల్తూరు మహారాజులు. రాజా వన్నెంరెడ్డికి పది తరాల తాతలు.. మొగల్తూరు మహారాజుకి స్నేహితులు. అది ఎలా అంటే వాళ్లు గేదెలు, ఆవులు కాస్తూ ఊరూర తిరిగేవారట. ఓ సారి మొగల్తూరు వచ్చినప్పుడు రాజుకి చల్లని మజ్జిక కాచి ఇచ్చారు. అందులో తమ స్టయిల్‌లో కొన్ని దినుజులు యాడ్‌ చేశారు. ఆ మజ్జిక తాగిన రాజు ఫిదా అయ్యాడట. రోజూ వచ్చి తాగిపోయేవాడట. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే కొన్ని రోజుల తర్వాత వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు బయలు దేరారు. ఈ విషయం రాజుకి తెలిసింది.

44
మజ్జిక ఇచ్చినందుకు 3000 ఎకరాలు రాసిచ్చిన కృష్ణంరాజు తాత
Image Credit : youtube/@idreammedia

మజ్జిక ఇచ్చినందుకు 3000 ఎకరాలు రాసిచ్చిన కృష్ణంరాజు తాత

దీంతో వారు వెళ్లిపోతే అంతటి మజ్జిక తాను తాగలేనని చెప్పి అక్కడే స్థిరపడేలా వారికి ఏకంగా 3000 ఎకరాలు రాసిచ్చాడట. అలా కృష్ణంరాజు తాతల నుంచి రాజా వన్నెంరెడ్డి తాతలకు మూడు వేల ఎకరాలు భూమి వచ్చింది. కానీ వాళ్లు దాన్ని నిలుపుకోలేకపోయారు. అమ్ముకుంటూ వచ్చారని, ఇప్పుడు కొంత వరకే మిగిలిందని, ఆస్తులన్నీ పోయాయని దర్శకుడు తెలిపారు. మజ్జిక కోసం రాజా వన్నెంరెడ్డి తాతలకు మొగల్తూరు మహారాజా ఏకంగా మూడు వేల ఎకరాలు రాసివ్వడం విశేషం. ఈ విషయం కృష్ణంరాజుతో తాను చాలాసార్లు మాట్లాడుకున్నట్టు తెలిపారు రాజా వన్నెంరెడ్డి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణంరాజు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Related Stories
Recommended image1
NTR vs Superstar Krishna: వారసుల కోసం గొడవకు దిగిన ఎన్టీఆర్‌, కృష్ణ.. చివరికి బాలయ్య, రమేష్‌ బాబుకి డిజాస్టర్లు
Recommended image2
Nagarjuna, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? ఆ స్టార్‌ డైరెక్టర్‌ వల్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved