వరుస పరాజయాలు చుట్టుముట్టడంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. కానీ ఈ సమయంలోనే అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.
వరుస పరాజయాలు చుట్టుముట్టడంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. కానీ ఈ సమయంలోనే అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇటీవల హరికృష్ణ అంత్యక్రియలు జరిగిన సమయంలో మనోజ్ బాడీగార్డ్ మాదిరి తారక్, కళ్యాణ్ రామ్ లను సేవ్ చేయడం వంటి విషయాలతో అతడికి అభిమానులు పెరిగారనే చెప్పాలి.
తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని సినిమాల్లో ఎప్పుడు నటిస్తావ్ అన్న అని అడగగా.. సరదా సమాధానాలు చెప్పాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మనోజ్ ని తాజాగా ఓ నెటిజన్.. 'మా' అసోసియేషన్ కి నిన్ను ప్రెసిడెంట్ గా చూడాలని ఉంది బ్రో.. అని క్వశ్చన్ చేశాడు. దీనికి సమాధానంగా మనోజ్.. 'నేను వెళితే తప్పకుండా అందరికీ ఫసకే. 'మా' చాలా నిజాయితీగా వ్యవహరిస్తోంది.
తమపై విమర్శలు చేస్తున్న వారిని తప్పు అని నిరూపించడం కోసం వారు తమ సంఘాన్ని రివిజన్ చేస్తారు. ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవడానికి వీలుగా 'మా' తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నేను నమ్ముతున్నాను'' అంటూ ట్వీట్ చేశాడు మనోజ్.
ఇవి కూడా చదవండి..
సినిమాలు ఎందుకు చేయడం లేదంటే.. హీరో 'తిక్క' సమాధానం!
