మంచు మనోజ్ హీరోగా సరికొత్త కథలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. కానీ గత నాలుగేళ్లలో మనోజ్ ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయారు.

మంచు మనోజ్ హీరోగా సరికొత్త కథలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. కానీ గత నాలుగేళ్లలో మనోజ్ ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయారు. 'ఒక్కడు మిగిలాడు' సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కుతాయనుకుంటే అది కూడా జరగలేదు. దీంతో తన తదుపరి సినిమా విషయంలో ఇప్పటివరకు ఓ క్లారిటీకి రాలేదు మనోజ్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీంతో అతడి అభిమానులు ట్విట్టర్ వేదికగా మనోజ్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు. 'అన్నా మీరు సినిమాలు ఎందుకు చేయడం లేదు' అని ఓ నెటిజన్ ప్రశించగా.. 'తిక్క' అని సరదా ఎమోజీ పెట్టాడు. 'తిక్కనా..? ఏ ఎందుకు అన్నయ్య' అని మరొకరు ప్రశ్నించగా.. 'చెప్తా చెప్తా అన్నీ సమయం వచ్చినప్పుడు చెప్తా' అని సమాధానం చెప్పాడు. 'ఆ సమయం ఎప్పుడు వస్తుందో ఏంటో' అంటూ మరొకరు అడగగా.. నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు.

మిగిలిన హీరోలతో పోలిస్తే.. మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు. తన కొంటె సమాధానాలతో వారిని నవ్విస్తుంటాడు. 

Scroll to load tweet…
Scroll to load tweet…


ఇవి కూడా చదవండి.. 

హరికృష్ణ మృతి: మీడియాకి మంచు మనోజ్ రిక్వెస్ట్!

చివరిదాకా నేనుంటాను తారక్.. మంచు మనోజ్ ట్వీట్!