సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొద్ది రోజులుగా ఒక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారట. అది కెరీర్ కు సంభందించిది. ఆయన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ సినిమా సంక్రాంతికు విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలనేది ఆయన్ని ఇప్పుడు కన్ఫూజన్ లో పడేసిందిట. పూర్తి ఎంటర్టైన్మెంట్ స్క్రిప్టు తో ముందుకు వెళ్దామా లేక మహర్షి, భరత్ అనే నేను తరహా సినిమాలు చేయాలా అనేది ఓ డైలమాగా ఉందిట. స్టార్ డైరక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు. దాంతో ఆ తర్వాత లెవిల్ డైరక్టర్స్ తో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. అందులో భాగంగానే గీతా గోవిందం దర్శకుడుతో గత కొద్ది రోజులుగా చర్చలు జరిపారు. 

ఆ కథ మరీ చిన్నగా ఉందని, తన అభిమానులను అలరించే స్టాయి స్దాయికి సరిపోతుందా లేదా అనే సందేహంతో కొన్ని మార్పులు చేర్పులు చేయిస్తున్నారట. అంతేకాకుండా స్క్రీన్ ప్లే లో కొన్ని మార్పులు చేయమని చెప్పారట. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రారంభిద్దామనుకునే లోగా భీష్మ సినిమాతో వెంకీ కుడుమల హిట్ కొట్టారు. ఆయన మహేష్ ని కలిసి ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ నేరేట్ చేసారట. దాన్ని డవలప్ చేయమని చెప్పారట.  సూపర్ స్టార్ కూడా దానికి కొన్ని ఇన్ పుట్స్ ఇస్తున్నారట. ఇలా రెండు స్క్రిప్టులలో ఏది ముందుకు తీసుకువెళ్లాలనేది మహేష్ కు సమస్యగా మారిందిట. 
 
ఈ రెండు స్క్రిప్టులను సినిమాలుగా చెయ్యాలనే ఆలోచనలతో మహేష్ ఉన్నారట. అయితే వీటిల్లో ఏది మొదట చేయాలి..ఏది తర్వాత చేయాలనేది వాళ్లు స్క్రిప్టులు డవలప్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందిట. రెండూ టెమ్ట్ చేస్తున్నాయిట. ఒక విషయం మాత్రం నిజం. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలనుకుంటున్నారు మహేష్. మరి ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరో ప్రక్క వంశీ పైడిపల్లి సైతం మరో కథతో మహేష్ ని ఇంప్రెస్ చేద్దామనే ఆలోచనలో స్క్రిప్టుని డవలప్ చేస్తున్నారట.