మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అసోసియేషన్ లో ఫండ్స్ కోసం సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్లాన్ చేసింది 'మా'. ఇందులో భాగంగా చిరంజీవితో అమెరికాలో ప్రోగ్రామ్స్ చేయించారు. చిరు తరువాత మహేష్ బాబు, ప్రభాస్ వంటి తారలతో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఫండ్స్ కలెక్ట్ చేయాలని అనుకున్నారు. అయితే చిరంజీవి అమెరికా వెళ్లడం ద్వారా వచ్చిన డబ్బుని దుర్వినియోగం చేశారంటూ శివాజీరాజా అండ్ కో పై 'మా' ప్రధాన కార్యదర్శి నరేష్ ఆరోపణలు చేశారు.

వీటిల్లో నిజం లేదంటూ శివాజీరాజా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. చిరంజీవి దగ్గరుండి ఈ విషయాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా వచ్చే నెలలో మహేష్ అమెరికా వెళ్లాల్సివుంది కానీ ఆయన ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లు వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.

ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి మహేష్ స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి ఈ వివాదం సద్దుమణిగిన తరువాత డేట్ ఫిక్స్ చేస్తే తన సహకారం అందిస్తానని చెప్పాడట. మహేష్ సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపడంతో చిరు అతడిని ప్రశంసించారట. మహేష్ నుండి కూడా రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా.. రెండుగా చీలిపోయిన సభ్యులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారి మధ్య సయోధ్య కుదిర్చే విధంగా చర్యలు చేపట్టాలని చిరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

ఇవి కూడా చదవండి..

'మా' ప్రెసిడెంట్ గా జయసుధ..?

శివాజీరాజాపై చిరు గుస్సా.. మరి రాజీనామా చేస్తాడా..?

'మా' కాంట్రవర్సీ.. మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చేశాడు!

'మా' వివాదం.. చిరంజీవిని ఇరికిస్తున్నారా..?