మహేష్ తన చెల్లెలు ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలో సందడి చేశారు. ఈ వేడుక కోసం మహేష్ బావమరిది అయిన సుధీర్ బాబు ఇంటికి వెళ్లారు. మహేష్ తన భార్య నమ్రతతో పాటు ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది. అలాగే మహేష్ మరో ఇద్దరు సిస్టర్స్ పద్మావతి గల్లా, మంజుల తమ భర్తలతో పాటు హాజరయ్యారు.  సూపర్ స్టార్ కృష్ణ సైతం కూతురు జన్మదినం రోజు ఇంటికి వచ్చి ఆమెను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేయడం జరిగింది. 

కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రియదర్శి కేక్ కట్ చేశారు. భోజనం అనంతరం కృష్ణ అక్కడ నుండి ఇంటికి బయలుదేరగా, మహేష్-నమ్రతలు మాత్రం కుటుంబ సభ్యులతో కొంత సేపు గడిపారు. చాలా కాలం తరువాత మహేష్ కుటుంబం మొత్తం ఒకచోట చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో ఈ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి. 

మరో వైపు మహేష్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ కోసం సిద్ధం అవుతున్నారు. దర్శకుడు పరశురామ్ తో మహేష్ సర్కారు వారి పాట మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో మొదలుకానుందని సమాచారం ఉంది. సెప్టెంబర్ లోనే సర్కారు వారి పాట మూవీ షూటింగ్ మొదలుకావాల్సి వుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, మోసాల గురించిన సెటైరికల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.