Asianet News TeluguAsianet News Telugu

బ్రెస్ట్ నిప్పల్ చూపించటంలో తప్పేముంది? సెమీ న్యూడ్ ఫొటోలతో రచ్చ

మడోన్నా  సెమీ న్యూడ్ ఫొటోలను కొన్నింటిని మడోన్నా ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. అవి ఇబ్బందికంగా ఉండడంతో వాటిని ఇన్ స్ట్రాగ్రామ్ తొలగించింది. అయితే మడోన్నా వాటిని మళ్లీ అప్లోడ్ చేసింది. అయితే మొదటిసారి అప్లోడ్ చేసిన ఈ ఫొటోల్లో తన బ్రెస్ట్ నిప్పల్ క్లియర్ గా కనిపించడంతో వాటిని తొలగించింది.

Madonna criticises Instagram for taking down nipple photo
Author
California City, First Published Nov 28, 2021, 7:26 AM IST

పాప్ సింగర్ మడోన్నా(Madonna) ఫామ్ లో లేకపోయినా ప్రపంచ వ్యాప్తంగా గా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ  ఆమె పాటపాడితే వినాలనే ఆసక్తి, ఉత్సాహం. అయితే ఆమె పాటల మీద కన్నా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయటంపై దృష్టి ఎక్కువ పెట్టింది. అవి కూడా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు అయ్యింటున్నాయి. చాలా సార్లు ఆమె చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మడోన్నా వుమెన్ బాడీ గురించి సెన్సేషన్ కామెంట్స్  చేసింది. పురుషులు తమ శరీరాన్ని అక్కడ చూపిస్తే పట్టించుకోరు. అయితే మహిళలు ప్రదర్శిస్తే రాద్దాంతం చేస్తారా..? అంటూ వ్యాఖ్యానించింది.  గత రెండు రోజులుగా ఇన్ స్ట్రాగ్రాం వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమంది.. 

రీసెంట్ గా మడోన్నా  సెమీ న్యూడ్ ఫొటోలను కొన్నింటిని మడోన్నా ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. అవి ఇబ్బందికంగా ఉండడంతో వాటిని ఇన్ స్ట్రాగ్రామ్ తొలగించింది. అయితే మడోన్నా వాటిని మళ్లీ అప్లోడ్ చేసింది. అయితే మొదటిసారి అప్లోడ్ చేసిన ఈ ఫొటోల్లో తన బ్రెస్ట్ నిప్పల్ క్లియర్ గా కనిపించడంతో వాటిని తొలగించింది. కానీ ఈ సారి షేర్ చేసినప్పుడు అవి కనిపించకుండా మడోన్నా జాగ్రత్తలు తీసుకుంది. అంతేకాదు ఆ తరువాత ఇన్ స్ట్రాగ్రాం తన ఫొటోలను తొలగించడంపై సెన్సేషన్ కామెంట్స్ చేసింది.

మడోన్నా మాట్లాడుతూ..‘ప్రతీ వుమెన్ శరీర భాగంపై కొందరికి తప్పుడు ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా నిప్పల్ చూపించగానే ఫొటోలను తొలగించారు. కానీ ఇవే ఒక బిడ్డ పెరగడానికి ఉపయోగపడుతాయని ఎందుకు ఆలోచించరు? స్త్రీని వెనుక భాగం మొత్తం చూపించినా ఏం చేయరు..కానీ చనుమ చూపించగానే తొలగిస్తారా..? నిప్పల్ ఒక్కటే స్త్రీ కామానికి సంకేతమా..? అని ప్రశ్నించింది. అలాగే మొగవాళ్లు తమ ఎదను పూర్తిగా చూపించినప్పుడు పట్టించుకోరు. కానీ ఆడవాళ్లు ప్రదర్శిస్తే మాత్రం ఎందుకు రాద్ధాంతం చేస్తారు..? అని అడిగింది. ఈ విషయంలో మేల్స్ ఫీమేల్స్ మధ్య భేదం ఎందుకు..? అని ఇన్ స్ట్రాగ్రాంలో ఓ పెద్ద స్టోరీ రాసింది. 

మరో ప్రక్క మడోన్నా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేస్తారు అనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. అయితే తన బయోపిక్‌ను మడోన్నాయే డైరెక్ట్‌ చేసుకోనున్నారట. ‘నా కథను నాకంటే ఎవరు బాగా చెప్పగలరు? ఈ సినిమా ఫోకస్‌ మొత్తం మ్యూజిక్‌ మీదే ఉంటుంది. సంగీతమే నన్ను నడిపించింది. నా జీవితంలో ఎన్నో సంఘటనలను ఈ సినిమాలో ప్రస్తావిస్తాను’ అని అన్నారు మడోన్నా. గతంలో ‘ఫిల్త్‌ అండ్‌ విస్‌డమ్, డబ్ల్యూ ఈ’ చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారామె.

Follow Us:
Download App:
  • android
  • ios