సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. కాలేయాన్ని ఆయన ద్వితీయ కుమారుడు అర్జున్ దానం చేశారు. ప్రస్తుతం ఇద్దరూ ఐసీయూలో ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో ఆయనకు ఈ చికిత్స జరిగింది.

నిన్న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు ఈ చికిత్స జరిగింది. అదే సమయంలో అశోక్‌ తేజకు కాలేయం దానం చేసిన ఆయన కుమారుడు అర్జున్‌కు కూడా వైద్యులు ఆపరేషన్‌ చేశారు. నిన్న సాయంత్రం అశోక్ తేజ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వైద్యులకు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన తొందరగా కోలుకోవాలని తెలుగు సిని పరిశ్రమలోని వారే కాక అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు.  

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం తెలిసిన వెంటనే మార్నింగ్ ఉత్తేజ్ కు ఫోన్ చేసి మామయ్యకు ఎలా ఉందని కనుక్కుని, వీలైతే మామయ్యతో మాట్లాడించు అని చెప్పారు. ఉత్తేజ్ వెంటనే మామయ్యతో అన్నయ్య చిరంజీవితో మాట్లాడించాను. చిరంజీవి మాటలు అశోక్ తేజకు కొండంత ధైర్యాన్ని, కొండంత నమ్మకాన్ని కలిగించాయి. టోటల్ పరిశ్రమే తనతో మాట్లాడినట్లుగా, ఎంతో ధైర్యంగా హాస్పటల్‌కు వెళుతున్నానురా.. అని చెప్పారు.  సుద్దాల అశోక్ తేజగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు.మరోవైపు అశోక్ తేజ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.