ఏడాది ప్రారంభంలోనే చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కె బాలు అకాలమరణం పొందారు. తమిళ పరిశ్రమకు చెందిన కె బాలు చిన్న తంబీ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. 1991లో విడుదలైన చిన్న తంబీ చిత్రంలో ప్రభు, కుష్బూ హీరో హీరోయిన్స్ గా నటించారు. 

నిర్మాత కె బాలు మరణవార్త నటుడు మరియు నిర్మాత ఆర్ శరత్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బాలు మరణవార్త కలచివేసిందని, ఆయన అకాల మరణం పరిశ్రమకు తీరనిలోటు అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రవేసిన కె బాలు ఆత్మశాంతించాలని ఆయన కోరుకున్నారు. పరిశ్రమ తరపున బాలు కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. 

శరత్ కుమార్ సోషల్ మీడియా పోస్ట్ తో బాలు మరణవార్త పరిశ్రమకు తెలిసింది. దీనితో చిత్ర ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు. చెన్నైలో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.