Aishwarya Rai vs Amitabh Bachchan: ఇద్దరిలో ఎవరి వద్ద ఎక్కువ డబ్బులున్నాయి? తెలిస్తే షాకే
Aishwarya Rai vs Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ వయసు 82 ఏళ్లు. ఐశ్వర్య రాయ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' హోస్ట్ చేయొచ్చని టాక్. అసలు విషయం ఏంటంటే, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ధనవంతులు? ఇదే ఇంట్రెస్టింట్. అదేంటో చూద్దాం.

amitabh bachchan, aishwarya rai
Aishwarya Rai vs Amitabh Bachchan:సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వయసు 82 ఏళ్లు. ఆయన టీవీలో బాగా పాపులర్ అయిన గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' హోస్ట్ చేయడం ఆపేస్తారట. అమితాబ్ బచ్చన్ తర్వాత ఆయన్ని కోడలు ఐశ్వర్య రాయ్ హోస్ట్ చేయొచ్చని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ కోటీశ్వరులో ఓ లుక్కేద్దాం.

amitabh bachchan
అమితాబ్ బచ్చన్ సినిమాలు, యాడ్స్ ద్వారా బాగా సంపాదిస్తారు. ఒక్కో సినిమాలో నటించడానికి 6 కోట్ల రూపాయలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెడతారు.

amitabh bachchan
అమితాబ్ బచ్చన్‌కి కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర 2 మెర్సిడెస్, 1 రేంజ్ రోవర్‌తో పాటు 16 లగ్జరీ కార్లు ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం అమితాబ్ బచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ 120 కోట్ల రూపాయలు. ఆయన నెట్ వర్త్ 3,190 కోట్ల రూపాయలని సమాచారం.

aishwarya rai
ఐశ్వర్య రాయ్ సినిమాలు, యాడ్స్‌తో పాటు ప్రాపర్టీస్, స్టార్టప్‌ల ద్వారా కూడా కోట్లు సంపాదిస్తుంది. ఆమెకు చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఉన్నాయి.

aishwarya rai
ఐశ్వర్య బెంగళూరులోని ఎంబే, హెల్త్ కేర్ స్టార్టప్ పాజిబుల్‌తో సహా విండ్ పవర్ ప్రాజెక్ట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసింది. ముంబై, దుబాయ్‌లో కూడా ఐశ్వర్యకి ప్రాపర్టీస్ ఉన్నాయని సమాచారం.

aishwarya rai
ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ ధనవంతురాలు. ఐశ్వర్య రాయ్ దగ్గర 776 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఈ లెక్కన బిగ్ బీ కంటే ఐష్ వెనకబడిపోయిందని చెప్పొచ్చు.
అయితే అమితాబ్ దాదాపు ఆరు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్నారు. ఎన్నో వందల సినిమాలు చేశారు. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్‌గా రాణించారు. అత్యధిక పారితోషికం అందుకునే హీరోగా నిలిచారు. ఆయనతో ఐష్ పోటీ పడటం కష్టమనే చెప్పొచ్చు.
read more: Nagarjuna: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ డైరెక్టర్‌తో నాగార్జున సినిమా? ఇద్దరికీ సాహసమే
also read: బాలకృష్ణ చేయాల్సిన ఫస్ట్ 3డీ మూవీ ఏంటో తెలుసా? ఇంతటి భారీ సినిమా ఎలా ఆగిపోయింది?

