Nagarjuna: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ డైరెక్టర్‌తో నాగార్జున సినిమా? ఇద్దరికీ సాహసమే
Akkineni Nagarjuna: నాగార్జున ఇప్పుడు సోలోగా సినిమాలు లేవు. మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్ చేస్తున్నారట. 20ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్‌తో మూవీ చేయబోతున్నారట.

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna: నాగార్జున ప్రస్తుతం సోలోగా ఇంకా మరే సినిమా ప్రకటించలేదు. `నా సామిరంగా` తర్వాత ఆయన కొత్త సినిమాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆయన కోలీవుడ్ రజనీకాంత్‌తో `కూలీ` మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
అలాగే ధనుష్ `కుబేరా` సినిమాలో మరో హీరోగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఇంకా తన సోలో సినిమా అనౌన్స్ చేయలేదు.

Akkineni Nagarjuna
అయితే ఇంకా మరే ప్రాజెక్ట్ కూడా సెట్ కాలేదని తెలుస్తుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాగార్జున మంచి పవర్ ఫ్యాక్డ్ మూవీతో రావాలనుకుంటున్నారు. ఇంటిళ్లిపాదిని ఆకట్టుకునే మూవీతో రావాలనుకుంటున్నారట. పండగలాంటి సినిమా చేయాలనుకుంటున్నారట. ఈ క్రమంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఓ క్రేజీ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారట. అదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

sivamani
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున సినిమా చేయడానికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని తెలుస్తుంది. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. `శివమణి` అప్పట్లో సంచలనం సృష్టించింది. అందులో ఫోన్ నెంబర్ అప్పట్లో వైరల్ అయ్యింది.
కొన్నాళ్లపాటు ఈ నెంబర్ నే గుర్తు చేసుకున్నారు ఆడియెన్స్. ఆ తర్వాత `సూపర్`తో మరోసారి వీరిద్దరు కలిసి పని చేశారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వీరి కాంబోలో మూవీ రాలేదు. ఇన్నాళ్లకి ఇప్పుడు సెట్ కాబోతుందట.

puri jagannadh, nagarjuna
ఇటీవలే పూరీ జగన్నాథ్ హీరోగా నాగార్జునకి లైన్ నెరేట్ చేశాడట. దానికి నాగ్ బాగా ఇంప్రెస్ అయ్యారట. చాలా రోజుల తర్వాత ఈ లైన్‌కి ఆయన బాగా ఎగ్జైట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయి. అన్నీ ఓకే అనుకుంటే త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇది ప్రాథమిక స్థాయిలోనే ఉందని, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలి, అది నాగ్‌కి నచ్చాలి? ఆ తర్వాత సినిమా ప్రకటన చేయాల్సి ఉంది. దీనికి కాస్త సమయం పట్టే ఛాన్స్ ఉంది. కానీ సెట్ అయితే మాత్రం 20 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ సెట్ కాబోతుందని చెప్పొచ్చు. ఇది అటు పూరీ, ఇటు నాగార్జున ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే వార్త అనే చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి.

puri jagannadh, nagarjuna
పూరీ జగన్నాథ్ చివరగా `డబుల్ ఇస్మార్ట్` చిత్రంతో తన లక్‌ని పరీక్షించుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. డిజాస్టర్ అయ్యింది. అదే కాదు వరుసగా `ఇస్మార్ట్ శంకర్` తప్ప ఇటీవల కాలంలో పూరీ సినిమాలు ఆడియెన్స్ ని అలరించలేకపోయాయి. ఈ క్రమంలో అటు పూరీ జగన్నాథ్‌కి, ఇటు నాగార్జునకి చాలా కీలకం. ఇద్దరికీ సోలోగా హిట్ కావాలి. మరి ఈ ప్రాజెక్ట్ తో అది దక్కుతుందా అనేది చూడాలి.
read more: బాలకృష్ణ చేయాల్సిన ఫస్ట్ 3డీ మూవీ ఏంటో తెలుసా? ఇంతటి భారీ సినిమా ఎలా ఆగిపోయింది?
also read: మోహన్ బాబు వల్ల బోల్తా కొట్టిన చిరంజీవి సినిమా, బాక్సాఫీస్ దగ్గర విలవిల్లాడిన మెగా మూవీ ?

