MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ

Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ

చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రేవతి ప్రేమ, పెళ్లి జీవితం మాత్రం ఎన్నో కష్టాలు, కన్నీళ్లతో నిండి ఉంది. ఆమె వైవాహిక జీవితంలోని విషాద గాథను ఈ ఫొటో గ్యాలరీలో చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 23 2026, 10:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tragic Life Story of Actress Revathi
Image Credit : Asianet News

Tragic Life Story of Actress Revathi

సినీ తారల జీవితం రంగులమయం అని మనం అనుకుంటాం. కానీ వాళ్ల జీవితాల్లోనూ సామాన్యుల లాగే కష్టాలుంటాయి. నటి రేవతి కథ కూడా అలాంటిదే. ప్రస్తుతం 59 ఏళ్ల రేవతి.. కన్నడ, మలయాళం, తెలుగు, హిందీతో కలిపి ఐదు భాషల్లో నటించి పాన్-ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందారు. కేరళకు చెందిన ఈమె, 17 ఏళ్ల వయసులోనే  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఆరు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులతో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా కూడా పనిచేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వయసుకు తగ్గ పాత్రలే వస్తున్నాయి
Image Credit : google

వయసుకు తగ్గ పాత్రలే వస్తున్నాయి

ప్రస్తుతం రేవతి సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తున్నారు. దీనికి కారణం కూడా ఆమే ఇటీవల చెప్పారు. "నా వయసుకు తగ్గ పాత్రలే వస్తున్నాయి. దాని గురించి నాకు ఎలాంటి బాధ లేదు. కానీ వచ్చే పాత్రలు చాలెంజింగ్‌గా ఉండట్లేదు. ఎన్ని సినిమాల్లో నటించానన్నది కాదు, పాత్రల విలువే ముఖ్యం. అలాంటి విలువైన పాత్రల్లో నటించాలని నేను కోరుకుంటున్నాను. అందుకే రెండేళ్లకో సినిమా చేస్తున్నాను" అని రేవతి అన్నారు.

Related Articles

Related image1
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Related image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అస్సలు ఒప్పుకోలేదు, సినిమాపై అనుమానాలు.. ప్రకాష్ రాజ్ పై వైరల్ కామెంట్స్
35
సినిమాటోగ్రాఫర్ సురేశ్ చంద్ర మీనన్‌ను ప్రేమించి
Image Credit : Instagram

సినిమాటోగ్రాఫర్ సురేశ్ చంద్ర మీనన్‌ను ప్రేమించి

నటి రేవతి 1986లో సినిమాటోగ్రాఫర్ సురేశ్ చంద్ర మీనన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఆమె కెరీర్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్నారు. ఇద్దరూ కలిసి చాలా సినిమాలకు పనిచేశారు. రేవతి తన జీవితాంతం సంపాదించిన డబ్బుతో రెండు సినిమాలు నిర్మించారు. వాటికి సురేశ్ దర్శకత్వం వహించారు. ఒక సినిమా హిట్టయినా, మరో సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో రేవతి తన ఆస్తినంతా కోల్పోయారు. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో పిల్లలు పుడితే కష్టమని భావించిన సురేశ్, ఆమెకు తెలియకుండా సర్జరీ చేయించుకున్నారట.
45
భర్త మోసం చేశాడని తెలిసి
Image Credit : Instagram

భర్త మోసం చేశాడని తెలిసి

ఈ విషయం రేవతికి మొదట తెలియదు. చాలా ఏళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఇంట్లో వాళ్లు అడగడం మొదలుపెట్టారు. అప్పుడు సురేశ్ తప్పు మొత్తం రేవతిదే అని చెప్పాడు. మొదట ఇది నిజమేనని నమ్మిన రేవతికి, ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఇది ఆమెను తీవ్ర షాక్‌కు గురిచేసింది. భర్త మోసం చేశాడని తెలిసి ఆమె తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే, సురేశ్ పేరు మీద ఒక స్టూడియో ప్రారంభించి, అతని కోసం షేర్లు కూడా కొన్నారు. ఇద్దరూ కలిసి తమిళ టీవీ కోసం చాలా సీరియల్స్ నిర్మించి, నటించారు. అవన్నీ విజయవంతమయ్యాయి.
55
అందరి ముందు గొడ్రాలు అని
Image Credit : Instagram

అందరి ముందు గొడ్రాలు అని

భర్త సర్జరీ చేయించుకుని, తనను అందరి ముందు గొడ్రాలు అని పిలుస్తున్నాడని తెలుసుకున్న రేవతి, తీవ్రంగా నొచ్చుకుని విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. విడాకులైన కొన్ని సంవత్సరాల తర్వాత, నటి రేవతి 48 ఏళ్ల వయసులో IVF చికిత్స ద్వారా తల్లి అయ్యారు. తన కూతురి వల్లే తన జీవితానికి ఓ అర్థం వచ్చిందని, కూతురు కొంచెం పెద్దయ్యాక అన్ని విషయాలు చెబుతానని రేవతి అంటారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అస్సలు ఒప్పుకోలేదు, సినిమాపై అనుమానాలు.. ప్రకాష్ రాజ్ పై వైరల్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved