ఆసుపత్రి బెడ్‌పై అమ్మ, మరో మహిళతో నాన్న.. ఆ దారుణాన్ని తలుచుకుని యాంకర్ సౌమ్యరావు కన్నీళ్లు
జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్య రావు మరోసారి షోలో ఎమోషనల్ అయ్యింది. అయితే ఈ సారి తండ్రి చేసిన నిర్వాహకం బయటపెట్టి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

Sowmya rao(photo credit-etv mallemala)
యాంకర్ సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్‌గా రాణించిన విషయం తెలిసిందే. అనసూయ వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో సౌమ్య రావు వచ్చింది. కన్నడకు చెందిన ఈ నటి సీరియల్స్ ద్వారా కెరీర్‌ని ప్రారంభించి తెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఓ షోలో ఆమె హైపర్ ఆదితో కలిసి స్కిట్ చేసి మెప్పించింది. ఆ సమయంలో సౌమ్య రావు హైలైట్ అయ్యింది. అంతేకాదు ఈటీవీలో `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేసే ఛాన్స్ ని దక్కించుకుంది.

Sowmya rao(photo credit-etv mallemala)
దాదాపు ఏడాదికిపైగానే హోస్ట్ గా చేసింది సౌమ్య రావు. వచ్చీ రానీ తెలుగులో ఆకట్టుకుంది. అలరించింది. దీనికితోడు హైపర్ ఆదితో ఆమె కన్వర్జేషన్, స్కిట్లు ఆకట్టుకున్నాయి. దీంతో ప్రారంభంలో బాగా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత సౌమ్యరావుకి క్రేజ్ తగ్గింది. ఆమెని పెద్దగా పట్టించుకోలేదు. జబర్దస్త్ అంటేనే మసాలా, పులిహోర కలపడం, ఫన్ జనరేట్ చేయడం, ఎంటర్‌టైన్ చేయడం. కానీ సౌమ్య రావు అంత యాక్టివ్‌గా చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆమెని పక్కన పెట్టారు.

anchor sowmya rao (photo credit -ETV mallemala)
అయితే షోలో ఒకటి రెండు సార్లు ఆమె తన తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తన అమ్మని కాపాడుకోలేకపోయానని, తన సక్సెస్‌ని ఆమె చూడలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి సౌమ్యరావు కన్నీళ్లు పెట్టుకుంది. లేటెస్ట్ షోలో ఆమె మరోసారి తల్లిని గుర్తు చేసుకుంది. అందరి ముందు ఎమోషనల్ అయ్యింది.
అమ్మకాదు నా బిడ్డ అని తెలిపింది. అమ్మతో మంచిగా ఫోటో కూడా తీసుకోలేకపోయానని, అమ్మ బాగున్నప్పుడు తన వద్ద ఫోన్ లేదు, కెమెరా లేదని, కానీ ఆమె ఆసుపత్రి బెడ్‌పై ఉన్నప్పుడు కెమెరా ఉంది, ఫోన్లు ఉన్నాయి, కానీ మంచి ఫోటోలే లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్యరావు.

Sowmya rao(photo credit-etv mallemala)
ఈ క్రమంలో తండ్రి గురించి రియాక్ట్ అయ్యింది సౌమ్యరావు. నాన్న గురించి ఎప్పుడూ చెప్పలేదు అని యాంకర్ రష్మి అడిగింది. దీనికి ఆమె రియాక్ట్ అవుతూ నాన్న గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు అని తెలింది. వాళ్లు గొప్పవాళ్లు కాదు అని తెలిపింది.
అమ్మ ఆసుపత్రి బెడ్‌పై ఉన్నప్పుడు నాన్న మరో లేడీస్‌తో ఉన్నప్పుడు అమ్మ చూసింది అంటూ బోరున విలపించింది. ఆమె మాటలు ఆద్యంతం గుండెబరువెక్కించాయి. వైరల్ అవుతున్నాయి.

Sowmya rao(photo credit-etv mallemala)
తాజాగా సౌమ్యరావు `శ్రీదేవి డ్రామా కంపెనీ` హోలీ స్పెషల్ ఎపిసోడ్‌లో పాల్గొంది. ఇందులో హైపర్ ఆదితోపాటు జబర్దస్త్ ఆర్టిస్టులు, ఇతర టీవీ ఆర్టిస్ట్ లు కూడా పాల్గొన్నారు. దీనికి సౌమ్యరావు కూడా వచ్చింది. ఇందులో తన అమ్మ ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె ఇలా ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలై ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వైరల్ అవుతుంది. వచ్చే ఆదివారం ఈ ఎపిసోడ్ ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.
read more: Nagarjuna: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ డైరెక్టర్‌తో నాగార్జున సినిమా? ఇద్దరికీ సాహసమే
also read: బాలకృష్ణ చేయాల్సిన ఫస్ట్ 3డీ మూవీ ఏంటో తెలుసా? ఇంతటి భారీ సినిమా ఎలా ఆగిపోయింది?

