బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. హౌస్ లో అతడిని ఒంటరి చేసి హౌస్ మేట్స్ గ్రూపులు కట్టడంతో అతడికి అండగా.. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఈ ఆర్మీ ఒకానొక దశలో షోని శాసించే స్థాయికి వెళ్లింది. ఇప్పుడు కౌశల్ కి ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో.. నిరూపించడానికి అన్నట్లుగా కౌశల్ ఆర్మీ 2కె రన్ నిర్వహించించి.

ఆదివారం మాదాపూర్ లో మొదలైన ఈ 2కె రన్ కి భారీ మద్దతు లభించింది.. కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా ర్యాలీలో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చింది. దీనికి ప్రేక్షకుల నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కౌశల్ ఆర్మీ ప్రత్యేకంగా టీ షర్ట్ లను వేసుకొని అభిమానవులంతా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇక బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోవడంతో కౌశల్ ని విజేతగా చేయడానికి ఎంత చేయాలో.. అంతా చేస్తుంది కౌశల్ ఆర్మీ. ఒక వ్యక్తికి ఈ రేంజ్ లో ప్రేక్షకాదరణ దక్కడం కొందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీనంతకీ కారణం కౌశల్ ఆడే తీరు, ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే చెప్పడం, అతడి ప్రవర్తన అని తెలుస్తోంది.  

ఈ వార్తాకథనాలు కూడా చదవండి

బిగ్ బాస్2: కౌశల్ భార్యకి దండం పెట్టాలి.. దీప్తి షాకింగ్ కామెంట్స్!

కౌశల్ కోసం కౌశల్ ఆర్మీ ఏం చేస్తుందో తెలుసా..?

బిగ్ బాస్2: ఎలిమినేషన్ ట్విస్ట్.. ఆ ఇద్దరిలో వెళ్లేదెవరో..?