బిగ్ బాస్ షోకో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ కి జనాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కౌశల్ ని హౌస్ లో ఎవరు ఇబ్బంది పెట్టినా.. వారిని ఎలిమినేట్ చేసే విషయంలో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి.

ఒకానొక దశలో షో మొత్తాన్ని శాసించే రేంజ్ లో కౌశల్ ఆర్మీ వ్యవహరించింది. ఇప్పుడు షో చివరి దశకు చేరుకోవడంతో బయట కూడా కౌశల్ ఆర్మీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కౌశల్ కి సపోర్ట్ గా నిలుస్తూ 2కె రన్ నిర్వహిస్తోంది. ఒక కంటెస్టెంట్ పేరు మీద ఇలా రన్ నివహించడం తెలుగు బిగ్ బాస్ లో ఇదే మొదటిసారి. సీజన్ 1 లో కంటెస్టెంట్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించలేదు.

కౌశల్ కోసం 2కె రన్ నిర్వహిస్తోన్న విషయాన్ని కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనికి నెటిజన్ల నుండి భారీ స్పందన రావడం విశేషం. మాదాపూర్ లో ఈ 2కె రన్ నిర్వహించనున్నారు. దీనికి పోలీసుల నుండి పర్మిషన్ కూడా తీసుకున్నారు.