బిగ్ బాస్ చివరి దశకు చేరుకోవడంతో షోపై ఆసక్తి మరింత పెరిగిపోతోంది. ఎలిమినేషన్ అనేది ఇప్పుడు కీలకంగా మారిపోయింది. హౌస్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వారం ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది.

కౌశల్, అమిత్, శ్యామల, దీప్తి నామినేషన్స్ లో ఉన్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వారంలో 20 కోట్ల ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది. ఒక్క కౌశల్ కి 60 శాతం ఓట్లు పోల్ అవ్వగా, ఆ తరువాతి స్థానంలో దీప్తి 20 శాతం ఓట్లు దక్కించుకుంది. ఇక మిగిలిన 20 శాతమే ఓట్లలో అమిత్, శ్యామలకి సమానంగా పోలైనట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వీళ్లిద్దరిలో హౌస్ నుండి ఎవరు బయటికి వెళ్తారనే విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి.

నిజానికి గతవారమే బయటకి వెళ్లాల్సిన అమిత్ ఈ వీక్ కచ్చితంగా వెళ్లిపోతారనే మాటలు వినిపించాయి. ఇప్పుడు శ్యామలకి కూడా ఓట్లు తక్కువగా రావడంతో ఇద్దరిలో ఎవరిని పంపించాలనే విషయంలో హౌస్ మేట్స్ ఒపీనియన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. హౌస్ నుండి ఎవరు వెళ్లబోతున్నారో మరికొద్ది గంటల్లో తెలియనుంది! 

ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్2: కౌశల్ భార్యకి దండం పెట్టాలి.. దీప్తి షాకింగ్ కామెంట్స్! 

గీతాని తిడుతూ వీడియో.. నాని ఘాటు రిప్లై!

బిగ్ బాస్2: కౌశల్ పై తనీష్ అసహనం!

బిగ్ బాస్2: మీ ఇంప్రెషన్ ఎవడికి కావాలి..? గీతాపై కౌశల్ ఫైర్!

బిగ్ బాస్2: కౌశల్.. కావాలని కెలుక్కోకు.. గీతామాధురి వార్నింగ్!