బిగ్ బాస్ సీజన్ 2 లో మొదటి నుండి ఎవరితో కలవకుండా కేవలం గేమ్ మీద మాత్రమే దృష్టి పెడుతూ ఎవరితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకుండా తన కోసమే తాను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు కౌశల్. హౌస్ మేట్స్ కూడా కౌశల్ ని దూరం పెడుతూ ఏమీ పట్టనట్లుగా వ్యవహరించారు. కొన్నాళ్లకు కౌశల్ మిగిలిన హౌస్ మేట్స్ తో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ మళ్లీ ఏవో వివాదాలు రావడం, దూరం కావడం ఇలా జరుగుతూనే ఉంది.

మిగిలిన హౌస్ మేట్స్ తో పోలిస్తే.. కౌశల్ కి చాదస్తం ఎక్కువని, ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ మిగిలిన వారిని బ్యాడ్ చేస్తుంటాడని హౌస్ మేట్స్ ఒపీనియన్. అందుకే అతడితో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. హౌస్ మేట్స్ అంతా ఒక్కటై అతడికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటారు. నిన్నటి 'టికెట్ టు ఫినాలే' ఎపిసోడ్ లో కౌశల్, తనీష్ ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.

అసలు కౌశల్ బిగ్ బాస్ హౌస్‌లో ఏం చేస్తున్నారో నాకసలు అర్ధం కావడం లేదని గేమ్ ప్లాన్ ఏంటో నాకర్ధం కావడం లేదని తనీష్ అనండంతో కల్పించుకున్న దీప్తి.. మొన్న గీతా మాధురి నేను ఇదే విషయం గురించి చర్చించుకున్నామని అతడితో ఆమె భార్య ఎలా ఉండగలుగుతుందో ఆమె ఓపికకు సహనానికి దన్నం పెట్టొచ్చంటూ చెప్పుకొచ్చింది దీప్తి. దీనికి శ్యామల కూడా వంతపాడారు. 

ఇవి కూడా చదవండి.. 

గీతాని తిడుతూ వీడియో.. నాని ఘాటు రిప్లై!

బిగ్ బాస్2: కౌశల్ పై తనీష్ అసహనం!

బిగ్ బాస్2: మీ ఇంప్రెషన్ ఎవడికి కావాలి..? గీతాపై కౌశల్ ఫైర్!

బిగ్ బాస్2: కౌశల్.. కావాలని కెలుక్కోకు.. గీతామాధురి వార్నింగ్!