Asianet News TeluguAsianet News Telugu

Kannada Actor Dignath Injured: ప్రముఖ కన్నడ నటుడికి తీవ్ర గాయాలు.. గోవా బీచ్​లో జంప్​ చేస్తుండగా..

ప్రముఖ కన్నడ నటుడు దిగంత్ తీవ్రంగా గాయపడ్డారు. గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న దిగంత్ కు ప్రమాదం జరగడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఇంతకీ గోవాలో ఏం జరిగిందంటే.. ?
 

Kannada Actor Dignath Injured During Backflip In Goa, Airlifted To Bengaluru
Author
Hyderabad, First Published Jun 21, 2022, 10:19 PM IST

గోవా బీచ్లో కన్నడ సినీ నటుడు దిగంత్ తీవ్రంగా గాయపడ్డారు. సమ్మర్ సాల్ట్ జంప్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సమ్మర్ సాల్ట్ జంప్ చేస్తున్న క్రమంలో బీచ్‌లో పడి మెడకు గాయమైంది. ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన తన భార్య ఐంద్రితా రాయ్‌తో కలిసి సెలవుల కోసం గోవాకు వెళ్ళారు. ఫిట్‌నెస్ ఫ్రీక్, లవ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ప్రాణమిచ్చే దిగంత్ సమ్మర్‌సాల్ట్ చేస్తున్న సందర్భంగా ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు.

బీచ్ లో పడిపడటంతోనే దిగంత్‌కు మెడకు బలమైన గాయమైందని, దీంతో దిగంత్‌కి గోవాలో ప్రథమ చికిత్స అందించి  బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్‌కి ఎయిర్‌లిఫ్ట్‌ చేసి తీసుకువెళ్ళారు. తొలుత దిగంత్‌ను చికిత్స నిమిత్తం గోవాలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని మణిపాల్ ఆసుపత్రికి విమానంలో తీసుకెళ్లారు. దిగంత్‌ ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్న ఆసుపత్రి వైద్యులు.. ఆయన పరిస్థితి ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పుతున్నట్టు సమాచారం. 

ఇక దిగంత్ ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదని ఆయన తండ్రి కృష్ణమూర్తి  ఓ ప్రకటన రిలీజ్ చేశారు.  డాక్టర్‌లు పరీక్షించిన తర్వాత కృష్ణమూర్తి మాట్లాడుతూ డాక్టర్‌ ఆపరేషన్‌ చేయాలని చెప్పారు, అది చేసిన తరువాత దిగంత్  రెండు రోజుల్లో నడవగలరని అన్నారు.  దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో దిగంత్ మెడకు మాత్రమే గాయం అయిందని, వెన్నెముకకు గాయం కాలేదని తేలిందని అన్నారు.

ప్రస్తుతానికి దిగంత్ నడవలేని స్థితిలో ఉన్నాడని, ఎలాంటి పుకార్లను కూడా నమ్మవద్దని కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. కొన్నాళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో దిగంత్ కన్ను దెబ్బతింది. ప్రస్తుతం దిగంత్ గాలిపటం-2 సినిమాలో నటిస్తున్నాడు. యోగరాజ్ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది.  కన్నడ సినిమాల్లో స్టార్ గా ఎదగాలని చూస్తున్నాడు దిగంత్.  గతంలో వాన అనే సినిమాలో దిగంత్ ఒక మేజర్ పాత్రలో నటించాడు. అలా ఆయన తెలుగు వారికి కూడా పరిచయమే.

Follow Us:
Download App:
  • android
  • ios