ఆ రోజు సావిత్రి మా ఇంటికి తాగొచ్చింది : జమున

Jamuna about savithri
Highlights

ఆ రోజు సావిత్రి మా ఇంటికి తాగొచ్చింది : జమున 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జమున సావిత్రి గురించి మాట్లాడుతూ, సావిత్రితో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. " మా అబ్బాయిని ఉయ్యాలలో వేసే రోజున సావిత్రి బాగా తాగేసి వచ్చింది. బాబును ఎత్తుకుని ఆడించి తిరిగి ఉయ్యాలలో వేసింది. ఆ తరువాత రూములోకి వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకుని పెద్దగా ఏడ్చేసింది.

"నువు అదృష్టవంతురాలివి చెల్లి .. మంచి భర్త .. బంగారంలాంటి కొడుకు లభించారు అంది. జెమినీ అట్లా చేశాడు .. ఇట్లా చేశాడు అంటూ ఏడ్చేసింది. అప్పుడు సావిత్రి కళ్లు తుడిచి పక్కనే కూర్చోబెట్టుకున్నాను. జెమినీని చేసుకోవద్దని అందరూ నీతో చెప్పారు .. మోసపోతావని అన్నారు. అయినా వినిపించుకోకుండా బుట్టలో పడ్డావు. కష్టమో .. నష్టమో .. జరిగిందేదో జరిగిపోయింది. నీకు ఇద్దరు పిల్లలు వున్నారు .. ఇక నీ జీవితానికి వాళ్లే సంతోషాన్ని ఇస్తారు అని ఓదార్చాను .. ధైర్యం చెప్పాను" అన్నారు. 

loader