కోహ్లీ పై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నా

First Published 14, Jun 2018, 2:47 PM IST
Is this the real reason Armaan Kohli's girlfriend withdrew her complaint?
Highlights

కోహ్లీ పై నాకేమి కోపం లేదు

బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అర్మాన్ కోహ్లీపై తనకు ఎలాంటి కోపం లేదని ఆయన గర్ల్ ఫ్రెండ్, ఫ్యాషన్ స్టైలిస్ట్ నిరూ రాంధవా వివరించారు. ఆర్మాన్ కోహ్లీ, నిరూ రాంధవా గత మూడేళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. అయితే.. ఇటీవల  కోహ్లీ.. నిరూని దారుణంగా కొట్టాడు. కాగా.. ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం అతనిని అరెస్ట్ చేశారు.

అయితే.. అనూహ్యంగా ఆమె తన కేసును వాపస్ తీసుకుంటున్నట్లు వివరించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన నీరూ.. కేసు వెనక్కి తీసుకోవడానికి గల కారణాలు వెల్లడించారు.

‘అతడికి ఇతరులను హింసించగల సామర్థ్యం ఉంది. అందుకే అతడి ఆగడాలకు నేను బలయ్యాను. నా దగ్గర బ్రిటన్‌ పాస్‌పోర్టు ఉంది. యూకే వెళ్లి అక్కడే సెటిల్‌ అవ్వాలనుకుంటున్నాను. ఈ కేసును పట్టుకుని కూర్చుంటే తరచుగా ముంబై రావాల్సి ఉంటుంది. అర్మాన్‌ లాంటి దిగజారిన వ్యక్తి కోసం సమయం వృథా చేసుకోవడం ఇష్టం లేదు. నా జీవితంలో అతడో పీడకల. అతడు నా పట్ల ప్రవర్తించిన తీరుకు తగిన గుణపాఠం చెప్పాననే అనుకుంటున్నాను. పాజిటివ్‌ ఆటిట్యూడ్‌తో అతడిని క్షమించేశాను’ అంటూ వ్యాఖ్యానించారు.

కాగా తనకు బెయిలు కావాలంటూ అర్మాన్‌ చేసిన వి​ఙ్ఞప్తిని బాంద్రా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో జూన్‌ 26 వరకు అతడు జైలులోనే గడపాల్సి ఉంటుంది.

loader