ప్రియా వారియర్..బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌ను మించిపోయింది.

First Published 13, Feb 2018, 6:43 PM IST
internet sensation priya prakash varrier beat sunny leone on google celebrity search list
Highlights
  • ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు
  • ఇప్పుడీ పేరుతో ఇంటర్నెట్ లో జనాలు తెగ సెర్చ్ చేసి పారేస్తున్నారు
  • ప్రియా వారియర్..బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌ను మించిపోయింది.

రాత్రికి రాత్రే ఎవరూ సెలబ్రిటీలు కారని ఎవరన్నారు? ఒక్కసారి ప్రియా ప్రకాశ్ వరియర్‌ను చూడండి. ఈ ఇంటర్నెట్ సెన్సేషన్ ఇచ్చిన ఒక్క స్మైల్.. కోట్ల మంది గుండెల్ని కొల్లగొట్టింది. సోషల్ మీడియా క్వీన్‌ను చేసేసింది. ఓరు అదార్ లవ్ మూవీలోని ఓ సాంగ్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కదా. అందులో ప్రియా ఎక్స్‌ప్రెషన్స్.. నెటిజన్లను మనసు దోచుకుంది. రాత్రికి రాత్రే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య ఆరున్నర లక్షలు పెరిగింది. తాజాగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌ను మించిపోయింది. గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్స్ లిస్ట్‌లో సన్నీని వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది ప్రియా ప్రకాశ్. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కాగానే.. అసలు ఎవరీ ప్రియా అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. 

గూగుల్ అనలిటిక్స్ రిపోర్ట్‌లో సన్నీని ప్రియా మించినట్లు తేలింది. ఈ ఇద్దరి తర్వాతి స్థానాల్లో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, దీపికా పదుకోన్ ఉన్నారు. 18 ఏళ్ల ఈ కేరళ కుట్టి నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా పెద్ద స్టార్ అయిపోయింది. అసలు ఈ రెస్పాన్స్ తాను ఊహించలేదని ఆమె అంటున్నది. ఎంతైనా సోషల్ మీడియానా మజాకా.

loader