ఎప్పుడూ ఏదో ఒక కాంట్రావర్సీలో వార్తలో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో బాంబ్ పేల్చాడు. తనలాంటి స్వార్థపరుడి చేతిలో మొక్కలు మొలవవని ట్వీట్ చేసి నేనింతే అని మరోసారి చెప్పాడు.

వివరాల్లోకి వెడితే.. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఎంతోమంది ప్రముఖులు స్వీకరించి మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ ను ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళి పూర్తి చేశాడు.

తాను తన టీం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేశామని.. ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకువెళ్లడానికి రామ్ చరణ్, రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్, పూరీ జగన్నాథ్ లను నామినేట్ చేస్తున్నట్టు ట్వీట్ చేశాడు.

దీనికి రాం గోపాల్ వర్మ తనదైన స్టైల్లో తనకు గ్రీన్ అన్నా, ఛాలెంజ్ లన్నా తనకు పడవని చెప్పుకొచ్చాడు. అంతేకాదు మట్టిపిసకడం నాకు అసహ్యం అన్నాడు. దీంతో పాటు తనలాంటి స్వార్ధపరుడు మొక్కలు నాటడం సరికాదని, మీకు, మీ మొక్కలకు ఆల్ ద బెస్ట్ అంటూ రీ ట్వీట్ లో రిప్లై ఇచ్చాడు.