బాలీవుడ్ లో తెరకెక్కిన 'హౌస్ ఫుల్' సిరీస్ లో భాగంగా వస్తోన్న నూతన చిత్రం 'హౌస్ ఫుల్ 4'. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, పూజాహెగ్డే, కృతి సనన్, బాబీ దేవోల్, కృతి కర్భందా, రానాలు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫర్హాద్ సామే జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పునర్జన్మల నేపధ్యంలో సాగే కథతో తెరకెక్కించారు. 

1419, 2017 ల మధ్య కాలంలో సాగే కథాంశంతో వినోదాత్మకంగా సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ మొత్తం కన్ఫ్యూజన్, కామెడీతో నింపేశాడు దర్శకుడు.

రానా దగ్గుబాటి విలన్ పాత్రలో భయపెట్టాడనే చెప్పారు. కథలో అక్షయ్ కి తన పునర్జన్మ గుర్తొస్తుంది. కానీ ఆయనతో పాటు ఉన్న రితేష్, బాబీ, పూజా, కృతి కర్భందా, కృతి సనన్, పూజ హెగ్డేలకు మాత్రం గుర్తురాదు.

వారికి గత జన్మ గుర్తు చేయడానికి అక్షయ్ నానా తంటాలు పడుతుంటాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనేదే సినిమా. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.