సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు అనేక మలుపులు తిరిగి డ్రగ్స్ దగ్గర ఆగింది. సుశాంత్  ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె తప్పుడు షోవిక్ చక్రవర్తిలకు డ్రగ్ పెడ్లర్స్ తో సంబంధాలున్నాయని తేలింది. దేనితో వీరిద్దరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేయడం జరిగింది. కాగా కంగనా రనౌత్ కొంతకాలంగా బాలీవుడ్ పై డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారు. బాలీవుడ్ లో అనేకమంది ప్రముఖులు ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వాడతారని ఆమె చెప్పారు. దాదాపు 99 శాతం బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ అలవాటు ఉందని ఆమె చెప్పడం జరిగింది. 

ఈ విషయంలో మహారాష్ట్ర సర్కారుకి, కంగనా మధ్య వైరం నడుస్తుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ హీరోయిన్ కంగనాపై డ్రగ్ ఆరోపణలు చేశారు. కంగనాకు డ్రగ్స్ వాడే అలవాటు ఉందని ఆయన అన్నారు. అధ్యాయన్ సుమన్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని, అతనితో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు గతంలో కంగనా స్వయంగా ఒప్పుకున్నారని ఆయన ఆరోపణ చేశారు. 

మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆరోపణలకు కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అనిల్ దేశ్ ముఖ్ ఆరోణనలను నేను స్వీకరిస్తాను అన్నారు. అలాగే ముంబై పోలీసులు తనకు పరీక్షలు నిర్వహించాలి అన్నారు. తన కాల్ రికార్డ్స్, చాట్స్ పరిశీలించి డ్రగ్ పెడ్లర్ల తో తనకు సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో విచారణ జరపాలని అన్నారు. ఒకవేళ నేను డ్రగ్స్ వాడానని తెలిస్తే ముంబై వదిలి వెళ్లిపోతానని ఛాలెంజ్ విసిరారు.