తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే కొడుకులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ షాక్ గురయ్యారు.
హరికృష్ణ ఆకస్మిక మరణం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. తండ్రి హరికృష్ణ మృతదేహం వద్ద ఆయన తనయులు, సినీ హీరోలు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ బోరున విలపించారు. నార్కట్ పల్లి-అద్దంకి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం స్థానికులు ఆయన్ను నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వైద్యులు హరికృష్ణ మృతిచెందినట్లు తెలిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source

కాగా... తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే కొడుకులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ షాక్ గురయ్యారు. వెంటనే నార్కట్ పల్లికి బయలుదేరి వెళ్లారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న వారు తండ్రి హరికృష్ణ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.
