Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్ల కంటే కేసీఆర్ అందగాడనుకున్న కానీ.. వర్మ, కేటీఆర్ ల ట్వీట్లు!

హీరోయిన్ల కంటే కేసీఆర్ అందగాడు అనుకున్న కానీ.. ఆయన హీరోలకంటే కూడా అందగాడని ఇలా చెప్పాలంటే హిమాలయాల కంటే ఎక్కువగా ఆకర్షిస్తుంటారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. 

funny conversation between ram gopal varma and ktr
Author
Hyderabad, First Published Dec 12, 2018, 11:16 AM IST

హీరోయిన్ల కంటే కేసీఆర్ అందగాడు అనుకున్న కానీ.. ఆయన హీరోలకంటే కూడా అందగాడని ఇలా చెప్పాలంటే హిమాలయాల కంటే ఎక్కువగా ఆకర్షిస్తుంటారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు కేసీఆర్ కి 
శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కేసీఆర్ పై తన అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. ముందుగా ఆయన కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ.. ''హే కేటీఆర్ మీ నాన్న కేసీఆర్ 2.0 కాదు.. ఆయన రాజినికంత కంటే 20.0 రెట్లు, మహేష్ బాబు కంటే 200.0 రెట్లు, చంద్రబాబు కంటే 2000.0 రెట్లు ఎక్కువ'' అని ట్వీట్ చేయగా.. దానికి కేటీఆర్.. ''ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. మీకు ఈ ఫిగర్ చెప్పడానికి ఇంత టైమ్ ఎందుకు పట్టింది రాము గారు'' అని కామెంట్ పెట్టాడు.

దానికి వర్మ ''నేను మూగవాణ్ని అయిపోయాను.. ఏదేమైనా మీకు, మీ నాన్నగారికి 2.0 బిలియన్ చీర్స్'' అంటూ మందు బాటిల్స్ ఎమోజీలతో ట్వీట్ చేశారు. ఆ తరువాత ట్వీట్ లో ''నేనెప్పుడూ హీరోయిన్ల కంటే కేసీఆర్ అందగాడు అని అనుకేవాడ్ని కానీ ఆయన హీరోల కంటే అందంగా ఇంకా చెప్పాలంటే హిమాలయాల కంటే చాలా ఎట్రాక్ట్ చేస్తారు. 

ఒకవేళ మోదీ గుజరాత్ లో పెట్టిందే అతి పెద్ద స్టాట్యూ అయి ఉంటే గనుక దానికంటే 2.0 రెట్లు పెద్దదైన కేసీఆర్ స్టాట్యూని తెలంగాణా పెడుతుంది'' అని వర్మ ట్వీట్ చేశారు. వర్మ, కేటీఆర్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

గ్రేట్ ఎన్టీఆర్ నే చంద్రబాబు చంపాడు.. కేసీఆర్ విజయంపై పోసాని కామెంట్స్!

కేసీఆర్ విజయంపై వర్మ 'ఆగడు' స్పూఫ్ వీడియో!

ఈ విజయానికి మీరు అర్హులు.. కేటీఆర్ పై మహేష్ ట్వీట్!

అందుకే కేసీఆర్ ను మరోసారి గెలిపించారు: సూపర్ స్టార్ కృష్ణ

టీఆరెస్ పార్టీకి సినీ వరల్డ్ నుంచి విషెస్ వెల్లువ!

టీఆరెస్ పార్టీ గెలుపుపై నాని ట్వీట్!

Follow Us:
Download App:
  • android
  • ios