సీనియర్ హీరో వెంకటేష్, మెగాహీరో వరుణ్ తేజ్ లు హీరోలుగా దర్శకుడు అనీల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసింది.

బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోంది. ముప్పై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారంలో రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సోమవారం నాటికి రూ.90 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

మరికొద్దిరోజుల్లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని చెబుతున్నారు. సాధారణంగా ఈరోజుల్లో సినిమా లైఫ్ వారం మాత్రమే.. హిట్ టాక్ వస్తే మరో వారం రోజులు ఆడుతుంది. అంతకుమించే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది 'ఎఫ్ 2'. 

నిన్నటికి నిన్న కూడా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్లు వసూలు చేసి బయ్యర్లను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా జోరు చూసి ట్రేడ్ పండితులు సైతం షాక్ అవుతున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

F2 కలెక్షన్స్: 20 కొట్టేశారుగా!

'ఎఫ్ 2': ఫ్యాన్స్ వార్... క్రెడిట్ ఏ హీరోకి చెందాలి?

'ఎఫ్ 2' సెకండ్ డే కలెక్షన్స్!

'ఎఫ్ 2' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఫన్ .. సంక్రాంతి విన్ (ఎఫ్‌2 రివ్యూ)

ప్రీమియర్ షో టాక్: F2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) 

'ఎఫ్ 2' మూవీ ట్విట్టర్ రివ్యూ..!