వరుస విజయాలతో దూకుడు మీదున్న యువ దర్శకుడు అనీల్ రావిపూడి 'ఎఫ్ 2' అనే మల్టీస్టారర్ కథను తెరకెక్కించారు. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టీజర్, ట్రైలర్ లతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అందుకుంటుందని నిర్మాత దిల్ రాజు చాలా నమ్మకంగా చెప్పారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోలు పడడంతో సినిమా రిజల్ట్ బయటకి వచ్చింది. అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సంక్రాతికి ఫుల్ ఫన్ ఫిల్మ్ ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమా వెంకీ బౌన్స్ బ్యాక్ అయ్యారని.. ఒకప్పటి ఆయన సినిమాల్లో కామెడీ ఈ సినిమాలో చూశామని అంటున్నారు. వరుణ్ తేజ్ తెలంగాణా యువకుడిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించారని పోస్ట్ లు పెడుతున్నారు.

ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో ఆ ఫన్ కి ఫ్రస్ట్రేషన్ జోడించి మరింత ఎంటర్టైన్ చేశాడని అంటున్నారు. ఇద్దరు హీరోయిన్లు తమ నటనతో మెప్పించారని తెలుస్తోంది. భార్యా బాధితుల కథతో ఈ సంక్రాంతికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లు ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని అంటున్నారు. 

 

 

 

 

 

ప్రీమియర్ షో టాక్: F2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)