Asianet News TeluguAsianet News Telugu

సెట్స్ ఎక్కబోతునన దృశ్యం-3 మూవీ, రెండు భాషల్లో ఒకే సారి ప్లాన్ చేసిన మేకర్స్

ఇకటి తరువాత మరోకటి సీక్వెల్ సినిమాలు హిట్ కొట్టడంతో..  దృశ్యం మూవీ టీమ్ ముచ్చటగా మూడో సినిమాకు రెడీ అవుతున్నారు. షూటింగ్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 
 

drishyam3 movie shooting update
Author
First Published Aug 28, 2022, 4:07 PM IST

ఇకటి తరువాత మరోకటి సీక్వెల్ సినిమాలు హిట్ కొట్టడంతో..  దృశ్యం మూవీ టీమ్ ముచ్చటగా మూడో సినిమాకు రెడీ అవుతున్నారు. షూటింగ్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 

ఒక సినిమా హిట్ట‌యితే చాలు.. ఆ  సినిమాకు  వెంటనే సీక్వెల్ ప్లాన్ చేసేస్తున్నారు మేకర్స్. ఇక హిట్ సినిమాకు సీక్వెల్ అంటే.. ఆడియన్స్ కూడా ఆ సినిమాపై ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంతే కాదు ఆ సీక్వెల్ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతుంటాయి.  ప్రస్తుతం ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇలానే నార్త్ నుంచి సౌత్ కు.. సౌత్ నుంచి నార్త్ కు. ఎన్నో సినిమాలు ట్రావెల్ చేశాయి. ఇటు సౌత్ లో కూడా కొన్ని సినిమాలు ఒక భాష నుంచి మరో బాషయకు జంప్ చేస్తూ.. సీక్వెల్స్ గా రీమేక్ లు గా తెరకెక్కుతున్నాయి. 

అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఎన్నో ఆశలతో హిట్ అవుతుంది కదా అని చేసిన కొన్ని  సీక్వెల్‌ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొల్తాకొట్టినవి చాలానే ఉన్నాయి. కాని  కొన్ని సీక్వెల్స్ మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలనే ఇచ్చాయి.. అందులో దృశ్యం సినిమా ఒక‌టి.  ఎలాంటి అంచ‌నాల్లేకుండా రిలీజ్ అయ్యి..సూపర్ సక్సెస్ సాధించాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం2 రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. మలయాళంలో ఈ సినిమా సీనియర్ సూపర్ స్టార్ మోహాన్ లాల్ నటించగా..  ఈ రెండు సినిమాలు తెలుగులో విక్టరీ వెంకటేష్ చేసి ఇక్కడ కూడా సక్కెస్ సాధించాడు. 


అనుకోకుండా జ‌రిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు తాజాగా మరో సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ లో  మూడో  సినిమా ముస్తాబ‌వుతుంది. ఈ రెండు పార్ట్‌లకు కొనసాగింపుగా దృశ్యం 3 రానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రొడ్యూస‌ర్ ఆంటోని పెరంబ‌వూర్ ఓ అవార్డు ఫంక్షన్‌లో అధికారికంగా ప్ర‌క‌టించాడు. అయితే  దృశ్యం 3 తో ఈ సిరీస్ కు ముగింపు పలకబోతున్నారు. దృశ్యం-3  ది కంక్లూజన్‌ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. 

 

 

అయితే  ప్రతీ సారి.. మలయాళంలో చేసిన తరువాత తెలుగులో వెంకటేష్ ఈ సినిమాను రీమేక్ చేస్తూ వస్తున్నాడు. కాని ఈసారి అక్కడ మోహన్ లాల్.. ఇక్కడ వెంకటేష్ తో ఒకేసారి  మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూడో చిత్రాన్ని తెలుగులోనూ వెంక‌టేష్‌తో ఏక‌కాలంలో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్‌ను త్వరలోనే  స్టార్ట్ చేయబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios