ఇప్పుడంటే పెళ్లి కాక ముందు కన్నెపొర చిరిగిందా లేదా అనేది పెద్దగా పట్టింపులేని అంశమైపోయింది గానీ... ఆ రోజుల్లో మహిళలను దారుణంగా చూసేవారు. కాలం మారుతున్న కొద్దీ కొన్ని భావజాలాలు మారిపోతుంటాయి. ఓ కాలంలో న్యాయ సమ్మతమైనది మరో కాలంలో అధర్మంగా మారుతుంది. ఓ కాలంలో చాలా సహజం అనుకున్నది కాలక్రమేణా అరాచకంగా భావించవచ్చు. అలాంటి వాటిలో మనస్మృతి ఒకటి. వేల ఏళ్ల నాడు రాసిన ఈ మనుస్మృతిని ఇప్పుడు చదివితే మరీ ఇంత అన్యాయం ఉంటుందా అనిపించకమానదు. 

 

 

కానీ అదే మనుస్మృతి ఇంకా ప్రామాణికమని నమ్మే మహానుభావులూ ఉన్నారు. మరి ఇంతకీ ఆ మనుస్మృతిలో ఏముంది.. ప్రత్యేకించి మహిళల విషయంలో మనువు ఏం చెప్పాడో ఓసారి పరిశీలిద్దాం.. స్త్రీ ఎక్కువ కులం కలిగిన మగవాడితో సంభోగించినట్లైతే అది శిక్షార్హం కాదు. కానీ తక్కువ కులం కలిగిన పురుషునితో సంభోగిస్తే మాత్రం ఆమెను శిక్షించాలి. వెలివేయాలి. (మనుస్మృతి 8/364)

 

అవివాహిత స్త్రీ కన్నెపొర చినిగి పోయినట్లైతే  తక్షణమే ఆమెకు గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించాలి. (మనుస్మృతి 8/369). తన గొప్పతానాన్ని, ఆమె బంధువుల గొప్పతాన్ని పొగుడుతూ భర్తకు సంబంధించిన విధులను నిర్లక్ష్యం చేసిన మహిళను రాజు బహిరంగ స్థలంలో కుక్కలకు విసిరి వేయాలి. (మనుస్మృతి 8/370). భార్యలను అదుపులో పెట్టుకోవటం భర్త విధి. బలహీనుడైన భర్త కూడా భార్యను అదుపులో ఉంచటానికి శ్రమించాలి. (మనుస్మృతి 9/6).

 

 

తాగటం, చెడ్డ వ్యక్తుల సాహచర్యంలో ఉందటం, భర్త నుండి విడిపోవటం, సరదాగా తిరగటం, ఎక్కువ గంటలు నిద్రపోవటం, వంటరిగా ఉండటం... ఈ ఆరు సంగతులు స్త్రీల అయోగ్యతలు. (మనుస్మృతి 9/13).  అలాంటి మహిళలు అవిధేయులై, వయసుతో నిమిత్తం లేని అక్రమ సంబంధాలను కలిగి ఉంటారు. (మనుస్మృతి 9/14) పరపురుషులపై కాంక్షతో అలాంటి స్త్రీలు స్థిరమైన కోపంతో, సహజ హృదయరాహిత్యంతో భర్తలకు అవిధేయులై ఉంటారు.