Asianet News TeluguAsianet News Telugu

Prabhas : ప్రభాస్ కి పది రోజుల విరామం..!

ప్రభాస్ షూటింగ్స్ కి విరామం ప్రకటించారు. తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా గాయలపాలవుతున్న ప్రభాస్ సర్జరీ చేయించుకున్నారు. వైద్యుల సలహా మేరకు మరో పది రోజులు ఆయన రెస్ట్ తీసుకోవాలని తెలుస్తుంది.

Doctors suggested prabhas ten days of rest after surgery
Author
Hyderabad, First Published Jul 31, 2022, 12:32 PM IST

ప్రభాస్ (Prabhas) ఏక కాలంలో రెండు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఆయన నటిస్తున్న ప్రాజెక్ట్ కే, సలార్ సెట్స్ పై ఉన్నాయి. రెండు భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ కావడంతో ప్రభాస్ బాగా కష్టపడుతున్నారు. ఇటీవల సలార్ షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశారు. అలాగే ప్రాజెక్ట్ కె కోసం ఆయన బాగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు కొన్ని సర్జరీలు జరిగాయి. ఇటీవల ఓ సర్జరీ కోసం ప్రభాస్ యూరప్ వెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి ఇండియా వచ్చారు.

అయితే మరో పది రోజు ఆయన కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారట. ప్రభాస్ ప్రస్తుతానికి ఎటువంటి షూటింగ్లో పాల్గొనే ఛాన్స్ లేదంటున్నారు. మరోవైపు టాలీవుడ్ లో షూటింగ్స్ పై కూడా సస్పెన్సు కొనసాగుతుంది. ఆగష్టులో షూటింగ్స్ నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రభాస్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇక వచ్చే ఏడాది ప్రభాస్ నుండి రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. 2023 జనవరిలో ఆదిపురుష్ విడుదల కానుంది. ఇక సమ్మర్ కి సలార్ విడుదల అవుతుంది. అదే ఏడాది చివర్లో ప్రాజెక్ట్ కే విడుదలయ్యే సూచనలు కలవు.

ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచాయి. దీనితో ప్రభాస్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios