దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పేదంతా సొల్లు అంటున్నాడు నూతన దర్శకుడు వాస్తవ్. ద గ్రేట్ రామ్‌గోపాల్ వ‌ర్మ కెరీర్ మెద‌ట్లో శివ‌, క్ష‌ణక్ష‌ణంఅద్బుత‌మైన‌ చిత్రాలు తీసి చాలా మంది యూత్ ని ద‌ర్శ‌త్వం వైపు రావ‌టానికి మార్గం వేసిన గురువు.. అలాగే ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న కెరీర్ లోజెంటిల్‌మెన్ లాంటి చిత్రం తీసి శ‌భాష్ అనిపించుకున్నాడని  అప్పటిరోజులను గుర్తు చేసుకున్నాడు. 

రామ్‌గొపాల్‌వ‌ర్మ చేసిన చిత్రాలు చూసి ఇత‌ను 20 సంవ‌త్స‌రాల త‌రువాత టెర్మినేట‌ర్ లాంటి గొప్ప చిత్రాలు చేస్తాడు అని అనుకునేవారు..శంక‌ర్ ని మాత్రం మంచి చిత్రాలు తీస్తాడు అనుకున్నారు.. కానీ ఇప్ప‌డు రామ్‌గోపాల్ వ‌ర్మ తీస్తున్న నాసిర‌కం చిత్రాలు ఆఫీస‌ర్‌, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్, ఐస్‌క్రీమ్ లు చూస్తుంటే అభిమానుల‌కి కోపం వ‌స్తుందని అన్నారు. 

అటు ప‌క్క శంక‌ర్ రోబో లాంటి అత్యాధునిక‌మైన సాంకేతిక ప‌ర‌మైన చిత్రాలు తీస్తున్నాడని.. రామ్ గోపాల్ వర్మ చెప్పేది అంతా సొల్లు.. సొల్లుమాత్ర‌మేనని మండిపడ్డాడు. చాలా మంది అత‌నికి పిచ్చి ప‌ట్టిందేమో అనుకుంటున్నారని అన్నాడు. ఆయ‌న అభిమానిగా తానొక 'స్పెష‌ల్' చిత్రాన్ని తీసినట్లు చెప్పాడు. ఓక్క సారి నా చిత్రం చూసి అప్పుడు మాట్లాడు రామ్‌గోపాల్ వ‌ర్మ అని అంటున్నారు దర్శకుడు వాస్తవ్.

అంతేకాదు ఇటీవ‌ల మందు తాగి ఎవ‌డో రాసిచ్చిన పాటని పాడి సోష‌ల్ మీడియాలో పెట్టాడని.. మినిమ‌మ్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్న నువ్వు శివ అనే చారిత్రాత్మ‌క చిత్రాన్ని తీశావంటే న‌మ్మ‌లేకున్నామని.. నీలాంటి వాడిని నమ్మి నిర్మాత‌లు, న‌టీన‌టులు మోసపోతున్నారని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో ద్వ‌జ‌మెత్తాడు స్పెష‌ల్ చిత్రం ద‌ర్శ‌క‌డు వాస్తవ్‌. 

 

ఏపీకి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా..? వర్మ ఫైర్!

వర్మ చేసిన తప్పేమిటి: బాబు ప్రభుత్వంపై జగన్ ఫైర్

7 గంటల హైడ్రామా: బలవంతంగా హైదరాబాదుకు వర్మ తరలింపు

నేను పోలీస్ కస్టడీలో ఉన్నా.. వీడియో షేర్ చేసిన వర్మ!

బెజవాడలో ఆర్జీవీ అరెస్ట్: వర్మకు వైసీపీ నేతల మద్ధతు

అందుకే వర్మను అడ్డుకొన్నాం: విజయవాడ పోలీసులు

బెజవాడలో రామ్‌గోపాల్ వర్మ హైడ్రామా, అదుపులోకి తీసుకొన్న పోలీసులు