సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డిని రామ్‌గోపాల్ వర్మను పోలీసులు రామవరప్పాడు రింగ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తీరును నిరసిస్తూ వైసీపీ నేతలు మల్లాది విష్ణు, పార్థసారధి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రఘురామకృష్ణంరాజు అక్కడికి చేరుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ వర్మ ప్రెస్‌మీట్‌ను అడ్డుకోవడంతో పాటు ముందుగా బుక్ చేసుకున్న హోటల్ గదులను రద్దు చేయడం సరికాదన్నారు.

ప్రభుత్వమే ఈ సినిమాకు మళ్లీ హైప్ తీసుకొస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. వర్మ ప్రెస్‌మీట్‌ను ఆపడం వల్ల ఉద్రిక్తత ఏర్పడుతుంది కానీ.. ప్రెస్‌మీట్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తదని ఆయన పేర్కొన్నారు.