విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా హిట్ టాక్ రావడంతో మొదటి రోజు నుండే ఈ సినిమా వసూళ్ల విషయంలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పటికే రూ.40 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు అరవై కోట్ల దిశగా పరుగులు తీస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించలేదట.

'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత విజయ్ నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమా ప్రమోషన్లు ఓ రేంజ్ లో చేసి ఆ క్రేజ్ మరింత పెంచేశారు. విడుదల సమయానికి సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఆ అంచనాలకు మించి గీత గోవిందం సక్సెస్ అవ్వడం దర్శకనిర్మాతలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే ఈ సినిమా కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో మునిగి తేలుతున్నారు.

ఇప్పుడు ఈ వారం విడుదలైన సినిమాలకు నెగెటివ్ టాక్ రావడం కూడా గీత గోవిందానికి కలిసొస్తుంది. రూ.14 కోట్లతో రూపొందించిన ఈ సినిమా రూ.60 కోట్ల దిశగా పరుగులు తీయడం మామూలు విషయం కాదు. డిజిటల్, శాటిలైట్ రైట్స్ అదనం. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా 'గీత గోవిందం' నిలిచిపోతుంది.  

ఇవి కూడా చదవండి.. 

లవ్ మ్యారేజే చేసుకుంటా.. అమ్మాయి ఎలా ఉండాలంటే: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ పక్కన ఎవరు చేస్తారు..? హీరోయిన్ల సమాధానం!

'నీ టైమ్ నడుస్తోంది..' విజయ్ దేవరకొండపై మహేష్ కామెంట్!