సైరా చిత్రాన్ని మొదటి నుంచి ఓ వివాదం వెంటాడుతోంది. తమ అనుమతి లేకుండా సైరా చిత్రాన్ని విడుదల చేస్తున్నారని ఉయ్యాలవాడ వంశస్థులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సైరా విడుదల అడ్డుకునేందుకు హైకోర్టులో ప్రయత్నించారు. కానీ కోర్టు, సెన్సార్ బోర్డు సైరా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. 

ప్రస్తుతం ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు మానవహక్కుల కమిషన్ లో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వివాదంపై మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ సైరా చిత్రంపై జరుగుతున్న వివాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నిజాయతీగా చెబుతున్నా.. చిరంజీవి గారు సైరా చిత్రాన్ని ప్రారంభించే వరకు నాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరో తెలియదు.. భగవంతుడు నా అజ్ఞానాన్ని క్షమించుగాక. 

నాలాగా నరసింహారెడ్డి ఎవరో చాలా మందికి తెలియదు. నరసింహారెడ్డి గొప్పతనం ఏంటో ఈ సినిమా ప్రారంభమయ్యాకే తెలిసింది. చిరంజీవి లాంటి బిగ్ స్టార్ ఈ చిత్రం చేయడం వల్ల ఒక గొప్ప వ్యక్తి గురించి ఒక జనరేషన్ మొత్తం తెలుసుకుంటోంది. 

మా కుటుంబంలో మా పూర్వికులు గొప్పవారు ఉంటే.. వారి గురించి చిరంజీవి గారు సినిమా చేస్తే.. ఆయన కాళ్ళు కడిగి నెత్తిమీద చల్లుకునేవాడిని. సౌత్ ఇండియా గర్వించదగ్గ హీరో మా వంశం మీద సినిమా తీస్తుంటే మాకు ఎంత గర్వంగా ఉంటుంది. 

అలాంటి సైరా చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నప్పడు స్వార్థంతో మాట్లాడడం, చిరంజీవి లాంటి వ్యక్తిని రోడ్డుమీదికి లాగాలని ప్రయత్నించడం చాలా బాధాకరం. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అటెంబరో మన జాతిపిత గాంధీపై సినిమా చేశారు. గాంధీ మా జాతిపిత..ఇండియా మొత్తానికి నువ్వు డబ్బులు ఇవ్వాలి అని మనం అడిగామా అని హరీష్ ప్రశ్నించారు. 

సినిమా రిలీజ్ ముందు టెన్షన్ పెడితే మనం అనుకున్నది సాధించవచ్చు అని కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాంటి సంఘటనలు చిత్ర పరిశ్రమపై అధికమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు సాధించని ఘనత లేదు. సైరా చిత్రం ద్వారా ఆయనకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదు.. కానీ ఉయ్యాలవాడ లాంటి వీరుడికి గుర్తింపు లభిస్తోంది. ఈ  సమస్యలన్నింటిని అధికమించి సైరా చిత్రం ఘనవిజయం సాధించాలి అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. 

సైరా ట్రయల్ మెగా హిట్: కలెక్షన్లపై ఓవర్సీస్ ఆఫర్ల ఎఫెక్ట్

క్రికెట్ లో సచిన్.. సినిమాల్లో చిరు.. సైరాపై క్రికెటర్ శ్రీశాంత్!

మగధీర టైంలోనే అనుకున్నా.. సైరాపై అల్లు అర్జున్ కామెంట్స్!

చిరు అబద్ధం చెబుతున్నారు.. ఉయ్యాలవాడ వారసులు!