సైరా చిత్రం కోసం పనిచేసేందుకు దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం ముందుకు వచ్చారు. రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఇక నిహారిక కూడా చిన్న రోల్ లో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైరా వాయిస్ ఓవర్ అందించడం మరో విశేషం. 

ఇక సైరా చిత్రం గురించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందన కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా బన్నీ సోషల్ మీడియా వేదికగా సైరా చిత్రం గురించి అద్భుతమైన మెసేజ్ పోస్ట్ చేశాడు. 'మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వస్తున్న అద్భుత చిత్రం సైరా నరసింహారెడ్డి. 

సైరా చిత్రం తెలుగు సినిమాకే గర్వకారణం. కొన్నేళ్ల క్రితం మగధీర చిత్రం చూసినప్పుడు చిరంజీవిగారు ఇలాంటి విజువల్ వండర్ మూవీలో నటించాలని నాతోపాటు చాలా మంది కోరుకున్నారు. సైరా చిత్రం ద్వారా ఆ కోరిక నెరవేరబోతోంది. ఈ చిత్రాన్ని నిర్మించిన చరణ్ ని అభినందిస్తున్నా. 

ఓ తండ్రికి కొడుకు అందిస్తున్న అద్భుతమైన గిఫ్ట్ ఇది. సురేందర్ రెడ్డిగారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సైరా చిత్రం మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా' అని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#SyeRaaNarasimhaReddy

A post shared by Allu Arjun (@alluarjunonline) on Sep 30, 2019 at 1:55am PDT