Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్ ఫెయిర్ ఎలిమినేషన్
బిగ్ బాస్ షోలో రీతూ, డీమాన్ పవన్‌తో ఉండటాన్ని రీతూ తల్లికి నచ్చలేదని, ఆమె ఏడుస్తుందని దివ్వెల మాధురీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రీతూ తల్లి స్పందించి షాకిచ్చింది.

రీతూ చౌదరీ అన్ ఫెయిర్ ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 13వ వారం రీతూ చౌదరీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. సంజనాకి, రీతూకి మధ్య ఫైనల్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరగ్గా సంజనా సేవ్ అయి రీతూ ఎలిమినేట్ అయ్యారు. దీంతో అంతా షాక్ అయ్యారు. అంతా సంజనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని భావించారు. కానీ రీతూ పేరు రావడంతో ఆడియెన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రీతూ ఎలిమినేషన్‌కి సంబంధించిన చర్చ జరుగుతుంది. అంతా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటున్నారు. బిగ్ బాస్ కావాలనే రీతూని హౌజ్ నుంచి పంపించారని కామెంట్లు చేస్తున్నారు.
రీతూ ఎలిమినేషన్ కి కారణమిదే
రీతూ ఎలిమినేషన్‌కి ఆమె ప్రవర్తనే కారణమని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆమె టాస్క్ లు ఆడే దాని కంటే చేసే హడావుడినే ఎక్కువగా ఉంటోంది. బాగా అరుస్తోంది. ప్రతి దానికి ఏడుస్తోంది. హౌజ్‌లో బాగా చిరాకుగా మారిందని, అందుకే ఆమెని ఎలిమినేట్ చేసినట్టు స్టార్ మా వర్గాల నుంచి వినిపిస్తోన్న టాక్. డీమాన్ పవన్‌తో బాండింగ్‌లో స్ట్రక్ అవుతూ, దాన్నుంచి బయటపడటం లేదని, పైగా ఇరిటేటింగ్‌గా మారిన నేపథ్యంలో రీతూని హౌజ్ నుంచి పంపించినట్టు సమాచారం.
డీమాన్ పవన్‌తో రిలేషన్‌పై క్లారిటీ
ఇదిలా ఉంటే ఎలిమినేషన్ అయిన తర్వాత రీతూ మీడియాతో మాట్లాడింది. తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో అర్థం కావడం లేదని, తనకే షాకింగ్‌గా ఉందని తెలిపింది. అదే సమయంలో డీమాన్ పవన్‌తో రిలేషన్‌పై ఓపెన్ అయ్యింది. అతనితో తన బాండింగ్ స్నేహం అని, బెస్ట్ ఫ్రెండ్ అని మనం ఎవరినైతే ఫీలవుతామో, అలానే పవన్ కూడా. అతని కారణంగా తన ఆట డౌన్ అయ్యిందనేది నిజం కాదని, తాను బాగానే గేమ్ అడినట్టు తెలిపింది. ఇంటికెళ్లాక తాను ఏం మిస్టేక్ చేశానో చూసుకుంటానని చెప్పింది రీతూ.
దివ్వెల మాధురీకి రీతూ తల్లి కౌంటర్
ఈ క్రమంలో దివ్వెల మాధురీ ప్రస్తావన వచ్చింది. మాధురీ ఎలిమినేట్ అయిన తర్వాత పవన్, రీతూ రిలేషన్‌పై మాట్లాడుతూ, విమర్శలు చేసింది. వాళ్లు డ్రామాలు ఆడుతున్నారని చెప్పింది. వారిని ఫేక్ రిలేషన్ అని పేర్కొంది. అదే సమయంలో రీతూ వాళ్ల అమ్మ తనకు ముందే చెప్పిందని, ఆ అబ్బాయికి దూరంగా ఉండమని చెప్పమని ఏడ్చిందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది మాధురీ. తాజాగా రీతూ చౌదరీ మదర్‌కి ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ, నాకు తెలియదు, నేను ఆమెకి ఏం చెప్పలేదు, అసలు ఆమెకి, తనకు సంబంధమే లేదు, ఆమె ఏ ఉద్దేశ్యంతో వెళ్లిందో నాకు తెలియదు. నేను ఇలా చెప్పిన మాట నిజం కాదు, ఆమెనే కావాలని చెప్పింది` అని పేర్కొంది రీతూ వాళ్ల తల్లి.
వైల్డ్ కార్డ్ లో వచ్చిన మూడు వారాలకే దివ్వెల మాధురీ ఎలిమినేట్
దీంతో దివ్వెల మాధురీ అసలు రూపం బయటపెట్టిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆమెని దారుణమైన కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దివ్వెల మాధురీ ఐదో వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎనిమిదో వారం ఎలిమినేట్ అయ్యింది. అంటే ఆమె ఎంట్రీ ఇచ్చిన మూడో వారమే హౌజ్ నుంచి వెళ్ళిపోయింది మాధురీ. తానే వెళ్లిపోయినట్టు చెప్పింది మాధురి.

